ఏప్రిల్ 19న తెలంగాణ కేబినెట్…లాక్ డౌన్ కొనసాగింపుపై చర్చ 

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ (ఏప్రిల్ 19, 2020) భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశం జరుగనుంది.

  • Published By: veegamteam ,Published On : April 16, 2020 / 08:59 AM IST
ఏప్రిల్ 19న తెలంగాణ కేబినెట్…లాక్ డౌన్ కొనసాగింపుపై చర్చ 

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ (ఏప్రిల్ 19, 2020) భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశం జరుగనుంది.

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ (ఏప్రిల్ 19, 2020) భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశం జరుగనుంది. కరోనా నియంత్రణకు చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణలో లాక్ డౌన్ ఏప్రిల్ నెలాఖరు వరకు ఉండగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే3వ తేదీ వరకు పొడిగించింది. ఏప్రిల్ 20 నుంచి కొన్ని మినహాయింపులను కూడా ఇచ్చింది. 

ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు యథాతథంగా కొనసాగించాలా వద్దా, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకనుగుణంగా ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వడమా అనే విషయాలపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఏప్రిల్ 20 వ తేదీ వరకు యథాతథంగా లాక్ డౌన్ అమలవుతుందని ఆ తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేసే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలో కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

650కి చేరిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో బుధవారం (ఏప్రిల్ 15, 2020) కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 650కి చేరింది. ఇప్పటివరకు 118 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గురువారం (ఏప్రిల్ 16, 2020) మరో 128 మంది డిశ్చార్జ్ కానున్నారని వైద్య అధికారులు తెలిపారు. ప్రస్తుతం వేర్వేరు హాస్పిటల్స్ లో 514 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో 22 జిల్లాల్లో 259 కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. 

తెలంగాణలో హాట్‌స్పాట్ జిల్లాలు
తెలంగాణలో 28జిల్లాలను హాట్‌స్పాట్ కేంద్రాలుగా గుర్తించారు. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కరీంనగర్, నిర్మల్. నల్గొండను కరోనా క్లస్టర్స్ కలిగిన హాట్‌స్పాట్ జిల్లాగా పేర్కొంది కేంద్రం.

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు
సూర్యాపేట, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌, ఖమ్మం, భద్రాద్రి, జగిత్యాల, జనగాం, జయశంకర్‌, కుమ్రం భీం, ములుగు, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, సిరిసిల్ల, సిద్దిపేటలను ఆరెంజ్ జోన్ జిల్లాలుగా ప్రకటించారు.