Telangana Cabinet : ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం

ఈ నెల 5న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రగతి భవన్ లో ఉదయం 10:30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. జనవరి6న శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఈ సమావేశంలో ఆమోదం తెలపనుంది.

Telangana Cabinet : ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం

CM KCR

Telangana Cabinet : ఈ నెల 5న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రగతి భవన్ లో ఉదయం 10:30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. జనవరి6న శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఈ సమావేశంలో ఆమోదం తెలపనుంది. కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ కు బయల్దేరి వెళ్లనున్నారు. బేగంపేట విమనాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన నాందేడ్ కు వెళ్లనున్నారు. గురుద్వార్ లో కేసీఆర్ దర్శనం చేసుకోనున్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో నాందేడ్ లో పలువురు పార్టీలో చేరనున్నారు.

మరోవైపు నేటి నుంచి తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12:10 గంటలకు ఉభయ సభలు ప్రారంభవుతాయి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించునున్నారు. రెండేళ్ల అనంతరం బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. 2023-24 వార్షిక బడ్జెట్ ను ఈనెల 6న ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఈ సమావేశాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Telangana Assembly Governor speech : టీ.సర్కార్, గవర్నర్ మధ్య కుదిరిన సయోద్య.. గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు

కొత్త సమావేశం కానుండంతో గత ఏడాది బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేదు. అయితే, దీనిపై రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం రేగింది. ప్రస్తుతం కూడా గత సమావేశాలు కొనసాగిస్తూ గవర్నర్ ప్రసంగానికి అవకాశం లేదని మొదట ప్రభుత్వం ప్రకటించింది. కానీ తన ప్రసంగం లేకపోవడంతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై మొదటి అనుమతి ఇవ్వలేదు.

దీనిపై ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు ఇరు పక్షాల న్యాయవాదులు చర్చల అనంతరం రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సయోధ్య కుదిరింది. గవర్నర్ తమిళిసై ప్రసంగానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. అందుకనుగుణంగా ఇవాళ ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగనుంది.