Telangana Private Hospitals : ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా

ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా ఝలిపించేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సిద్దమైంది. నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేశారని ఫిర్యాదులు రావడంతో 64 ఆసుపత్రులకు తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కూకట్‌పల్లి ఓమ్నీ ఆసుపత్రిపై అత్యధికంగా ఆరు ఫిర్యాదులు అందాయి. ఆ తర్వాత బేగంపేటలోని విన్ ఆసుపత్రిపై ఐదు ఫిర్యాదులు అందాయి.

Telangana Private Hospitals : ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా

Private Hospitals

Telangana State Govt : : ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా ఝలిపించేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సిద్దమైంది. నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేశారని ఫిర్యాదులు రావడంతో 64 ఆసుపత్రులకు తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కూకట్‌పల్లి ఓమ్నీ ఆసుపత్రిపై అత్యధికంగా ఆరు ఫిర్యాదులు అందాయి. ఆ తర్వాత బేగంపేటలోని విన్ ఆసుపత్రిపై ఐదు ఫిర్యాదులు అందాయి. కాచిగూడలోని TX, ఆబిడ్స్‌లోని ఉదయ్‌ ఓమ్ని ఆసుపత్రులపై మూడు చొప్పున కంప్లెయింట్స్ వచ్చాయి. ఇక కేర్, లోటస్, కిమ్స్, మ్యాక్స్‌ క్యూర్, సెంచురీ, కాంటినెంటల్‌, సన్‌షైన్‌, హైదర్‌గూడ ఆపోలో ఆసుపత్రులకు కూడా నోటీసులు అందించింది.

ప్రైవేట్‌ ఆస్పత్రులు విచ్చలవిడిగా వసూళ్లు చేస్తున్నాయనే ఫిర్యాదులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే 64 హాస్పిటల్స్ పైన 88 ఫిర్యాదులు అందటంతో వారికి షోకాజ్ నోటీసులిచ్చిన ఆరోగ్య శాఖ.. కొన్ని హాస్పిటల్స్ అనుమతులు రద్దు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను భిన్నంగా ప్రజల నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తే లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్స్ కి వాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు.

Read More : Israel-Gaza Violence: గాజా వివాదంపై ఓటింగ్ కు భారత్ దూరం