Vaccination in Telangana: తెలంగాణలో మరోసారి కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్: పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు

శుక్రవారం నుంచి జులై నెల చివరి వరకూ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. వైద్య సిబ్బంది ప్రతీ ఇంటికి తిరిగి, వ్యాక్సిన్ వేసుకోని వాళ్లను గుర్తించి టీకా వేస్తారు.

Vaccination in Telangana: తెలంగాణలో మరోసారి కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్: పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు

Corona Vaccine

Vaccination in Telangana: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం, రానున్న వ్యాధుల సీజన్లో మరింత అప్రమత్తంగా ఉండేలా ఈ ప్రత్యేక వాక్సిన్ డ్రైవ్ నిర్వహించనుంది ప్రభుత్వం. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి జులై నెల చివరి వరకూ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. వైద్య సిబ్బంది ప్రతీ ఇంటికి తిరిగి, వ్యాక్సిన్ వేసుకోని వాళ్లను గుర్తించి టీకా వేస్తారు.

Other Stories: Chandrababu: రాష్ట్రంలో రూ. లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్, కాంట్రాక్టర్లు విలవిలాడుతున్నారు: మాజీ సీఎం చంద్రబాబు

ఇందు కోసం ప్రతీ గ్రామానికి 2 బృందాల వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక టీం.. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ టీకా వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సినేషన్​ క్యాంపునకు తరలిస్తుంది. మరో టీం గ్రామంలోని క్యాంపు పెట్టి టీకా వేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 16.36 లక్షల మంది రెండో డోసు వ్యాక్సిన్​ తీసుకోవాల్సి ఉంది. 29.51 లక్షల మంది బూస్టర్ డోసుకు అర్హత పొందారు. 12 నుంచి 18 ఏళ్ల వయసు వారిలో 70,827 మంది కనీసం ఒక్క డోసు కూడా వేసుకోలేదు. వీరందరికి వ్యాక్సిన్ వేసేందుకు ఆరోగ్య శాఖ సిబ్బంది రంగంలోకి దిగనున్నారు.

Other Stories: Covid-19 : భారత్‌లో కొత్తగా 4,041 కోవిడ్ కేసులు నమోదు