CM KCR : దేశానికే ఆదర్శంగా తెలంగాణ : సీఎం కేసీఆర్

ఎవరూ కూడా బద్దలు కొట్టలేని కంచుకోట టీఆర్ఎస్ అని గర్వంగా చెప్పారు. ప్రతీ రంగంలోనూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలు, నేతల సమాహారంతోనే అద్భుత ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.

CM KCR : దేశానికే ఆదర్శంగా తెలంగాణ : సీఎం కేసీఆర్

Cm Kcr

CM KCR in TRS Plenary : తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణకు కేంద్రం ప్రకటిస్తున్న అవార్డులే అందుకు నిదర్శనం అన్నారు. దేశంలో మొదటి 10 అత్యుత్తమ గ్రామాలు తెలంగాణవేనని చెప్పారు. తెలంగాణలో అవార్డులు లేని.. అవార్డుల రాని డిపార్ట్ మెంట్ అంటూ లేదన్నారు. అవినీతి రహితంగా, లక్ష్యశుద్ధితో ప్రజాపాలన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా దీవెనలతో అద్భుత పరిపాలన అందిస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభమైంది. పార్టీ జెండా ఆవిష్కరించి ప్లీనరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్లీనరీ వేదికపై అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతర ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆస్తి మన టీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. అనుక్షణం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు కాపాలాదారు టీఆర్ఎస్ అని తెలిపారు. సమరసైనికుల, కాపలాదారుల పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నారు.

Telangana : తెలంగాణ దేశానికే దిశనిర్ధేశం చూపుతోంది : మంత్రి హరీశ్ రావు

ఎవరూ కూడా బద్దలు కొట్టలేని కంచుకోట టీఆర్ఎస్ అని గర్వంగా చెప్పారు. ప్రతీ రంగంలోనూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలు, నేతల సమాహారంతోనే అద్భుత ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో ప్రొ.జయశంకర్, విద్యాసాగర్ రావు కృషి మరువలేనిదని కొనియాడారు.