Telangana: తెలంగాణలో 100 శాతం మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి

కరోనా వ్యాక్సినేషన్‌లో తెలంగాణ రికార్డు సృష్టించింది. ప్రభుత్వం, వైద్యసిబ్బంది కృషితో రాష్ట్రంలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తైంది.

Telangana: తెలంగాణలో 100 శాతం మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి

Vaccination

Telangana : కరోనా వ్యాక్సినేషన్‌లో తెలంగాణ రికార్డు సృష్టించింది. ప్రభుత్వం, వైద్యసిబ్బంది కృషితో రాష్ట్రంలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తైంది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన 9 నెలల తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సరిగా 337 రోజుల కింద ప్రారంభమైన వ్యాక్సినేషన్.. ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. పల్లెలు, పట్టణాలు, గుడాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వైద్య సిబ్బంది ఇల్లిల్లు తిరుగుతున్నారు. వైద్యసిబ్బంది కృషితో దేశంలో ఇప్పటికే 130 కోట్ల డోసుల పంపిణి జరిగింది.

చదవండి : Covid Vaccination In India : దేశంలో 60 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. 100 శాతం మందికి మొదటి విడత వ్యాక్సినేషన్ పూర్తైంది.. రెండోవిడత కూడా 61 శాతం మంది తీసుకున్నారు. మొదట్లో వ్యాక్సిన్ కోసం కొంత ఇబ్బంది పడినా క్రమంగా ఉత్పత్తి పెంచడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన 50 రోజులకే విరివిగా లభించింది. ఇక ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. ప్రతి రోజు 50 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఉత్పత్తి పెంచడంతో అనుకున్న సమయానికంటే ముందు వ్యాక్సినేషన్ ప్రక్రియ టార్గెట్ రీచ్ అయింది. మరో ఒకటి నెలల్లో పూర్తిస్థాయి 100 శాతం వ్యాక్సినేషన్ అందించిన రాష్ట్రంగా నిలిచే అవకాశం ఉంది.

చదవండి : Covid Vaccination : మీరు ప్రభుత్వ ఉద్యోగులా..వ్యాక్సిన్ తీసుకోలేదా, జీతం రాదు