ఐటీ ఎగుమతుల్లో  దేశంలోనే ప్రథమస్థానంలో తెలంగాణ 

  • Published By: srihari ,Published On : May 21, 2020 / 01:17 PM IST
ఐటీ ఎగుమతుల్లో  దేశంలోనే ప్రథమస్థానంలో తెలంగాణ 

కరోనా సమయంలోనూ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ సత్తా చాటింది. తెలంగాణ వార్షిక ఆదాయ నివేదికను రాష్ట్ర శాఖ మంత్రి కేటీఆర్…సీఎం కేసీఆర్ కు అందించారు. కరోనా సమయంలోనూ ఐటీ ఎగుమతుల్లో సత్తా చాటిన ఐటీ శాఖను సీఎం కేసీఆర్ అభినందించారు. ఎగుమతుల్లో రాష్ట్ర ఐటీ శాఖ 17.93 శాతం గ్రోత్ సాధించింది. దేశంలోనే ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. 

దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ నుంచే 11.6 శాతం ఎగుమతులు ఉండటం శోచనీయం. ఐటీ పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందని సీఎం కొనియాడారు. ఐటీ వృద్ధితో తెలంగాణ 7.2 శాతం ఎంప్లాయిమెంట్ గ్రోత్ ను సాధించింది. 

గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ఐటీ రంగం అభివృద్ధి బాటలో నడుస్తోంది. గతంతో పోలిస్తే ఈఏడాది మరింత అభివృద్ధి దశలో నడిచిందని ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. కొద్ది సేపటి క్రితం ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్…సీఎం కేసీఆర్ ను కలిసి 2019-20కి సంబంధించిన నివేదికను సీఎంకు ఇవ్వడంతో ఆ నివేదికను చూసి ఐటీశాఖ మంత్రి కేటీఆర్, కార్యదర్శిని అభినందించారు.  

నివేదికలోని అంశాలు పరిశీలించినట్లైతే జాతీయ సగటు 8.9 శాతంగా ఉంది. తెలంగాణ ఐటీ ఎగుమతులు 17.93 శాతానికి పెరిగాయి. 2018-19 సంవత్సరంలో భారతదేశ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 10.61 శాతం ఉండగా 2019-20 సంవత్సరానికి 11.58 శాతానికి పెరిగింది. 2018-19లో భారతదేశంలో ఎంప్లాయిమెంట్ లో చూస్తే 13.6 శాతం ఈ ఏడాది 13.34 శాతానికి పెరిగింది.