Telangana : డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్ధులు..ఆలోచిస్తాం అన్న మంత్రి సబితా

తెలంగాణ విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని విద్యార్దులు ముట్టడించారు. ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదావేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్టీయూ,ఉస్మానియా వర్శిటీ విద్యార్ధులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

Telangana : డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్ధులు..ఆలోచిస్తాం అన్న మంత్రి సబితా

Students Demand Postponement Of Degree Exams (3)

Students demand postponement of degree exams : తెలంగాణ విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని విద్యార్దులు ముట్టడించారు. ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదావేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్టీయూ,ఉస్మానియా వర్శిటీ విద్యార్ధులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కరోనా పూర్తిస్థాయిగా నియంత్రణ కాకపోవటంతో విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్దులు డిమాండ్ చేశారు.లేదంటే ఆన్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు నిర‌స‌న తెలిపారు. విద్యార్థులంతా వ్యాక్సిన్ వేయించుకోలేదనీ..ఈక్రమంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్దులకు కరోనా బారిన పడే అవకాశముందని కాబట్టి పరీక్షలు వాయిదా వేయాలని లేదంటే ఆన్ లైన్ లో నిర్వహించాలని..లేదంటే వ్యాక్సిన్లు వేసేవ‌ర‌కు పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన డిమాండ్స్ తో విద్యార్ధులు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

కాగా..పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్ తో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించటానికి నగరంలోని సత్యసాయి నిగమం నుంచి మంత్రి ఇంటి వరకు విద్యార్థులు ర్యాలీగా నిర్వహిస్తుంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో విద్యార్ధులు వినతిపత్రం సమర్పించటానికి మాత్రమే మంత్రిగారి ఇంటికి వెళుతున్నామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఈ క్రమంలో విద్యార్ధులకు పోలీసులకు మధ్య కాస్త వాగ్వాదం చోటుచేసుకోవటంతో ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది. దీంతో మంత్రి స‌బిత‌ జోక్యం చేసుకున్నారు.

ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని తాము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని ఈ సమయంలో పరీక్షలు వాయిదా వేయటం కుదరదని స్పష్టంచేశారు. పరీక్షలు వాయిదా వేయాల‌న్న డిమాండ్‌పై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవ‌డం కుద‌ర‌ద‌ని..విద్యార్ధుల కోరిక మేరకు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. కానీతమ డిమాండ్స్ మేరకు పరీక్షలు వాయిదా వేయాల్సిందేనంటూ విద్యార్ధులు అక్క‌డే రోడ్డుపై విద్యార్థులు బైఠాయించి ఆందోళ‌న తెలపటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొంతమంది విద్యార్ధులకు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రికత్త నెలకొంది.