Telangana Students: సీటు ఎక్కడొచ్చినా.. నచ్చిన కాలేజిలో చదువుకోవచ్చు

కాలేజీ ఎంపిక చేసుకునే ప్రక్రియలో స్టూడెంట్లు చాలా అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. వాటిల్లో ప్రధానంగా అక్కడ చెప్పే క్లాసులు. ఫ్యాకల్టీ బాగుందని తాము సెలక్ట్ చేసుకున్న కాలేజీకే వెళ్లాలని ఆశపడుతుంటారు.

Telangana Students: సీటు ఎక్కడొచ్చినా.. నచ్చిన కాలేజిలో చదువుకోవచ్చు

Students Offer (1)

Telangana Students: కాలేజీ ఎంపిక చేసుకునే ప్రక్రియలో స్టూడెంట్లు చాలా అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. వాటిల్లో ప్రధానంగా అక్కడ చెప్పే క్లాసులు. ఫ్యాకల్టీ బాగుందని తాము సెలక్ట్ చేసుకున్న కాలేజీకే వెళ్లాలని ఆశపడుతుంటారు. కానీ, ఒకవేళ తాము అనుకున్న కాలేజి కాకుండా మరో కాలేజీలో సీట్ కన్ఫామ్ అయితే తప్పక వెళ్లాల్సిందే. ఇకపై ఈ పద్ధతికి స్తస్వి చెప్పేయనుంది తెలంగాణ ఉన్నత విద్యామండలి.

ఇందుకోసం క్లస్టర్ విధానాన్ని తీసుకురానున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేసేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణతో పాటు పలు వైస్ ఛాన్సలర్ల కమిటీ కస్టర్ల ఏర్పాటుపై సమాలోచనలు చేసింది. ఈ క్లస్టర్లలో కనీసం 6 కాలేజీలు ఉంచాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

రెండు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, మరో రెండు యూనివర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీలు, మరో రెండు యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కాలేజీలను లిస్టు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి త్వరలో రాష్ట్రమంతా అమలు చేయాలనేది అధికారుల ప్లాన్.

ముందుగా హైదరాబాద్ లో కాలేజీలు క్లస్టర్ గా ఏర్పాటు చేసి డిగ్రీ కాలేజీలతో పాటు హైదరాబాద్ ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సహా ఇతర యూనివర్సిటీలు జాతీయ, అంతర్జాతీ సంస్థలను క్లస్టర్ విధానంలో చేర్చాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఈ విధానం ద్వారా స్టూడెంట్లతో పాటు ఫ్యాకల్టీకి కూడా బెనిఫిట్ దొరుకుతుంది. క్లస్టర్ లోని ఓ కాలేజీలో పని చేసే సిబ్బంది మరో కాలేజీలో బోధించే అవకాశం కల్పిస్తారు. ల్యాబ్ లు, మెటీరియల్, లైబ్రరీ తదితర సదుపాయాలను పరస్పరం వాడుకునే అవకాశం కల్పిస్తారు. ఈ ఎడ్యుకేషనల్ ఇయర్ నుంచే ఈ క్లస్టర్ విధానం అమల్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.