NTR Bhavan : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లీజు రద్దు చేయాలనే లెటర్ పై స్పందించిన టి.టీడీపీ

హైదరాబాద్ నగరంలో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లీజు రద్దు చేయాలంటూ సర్క్యులేట్ అవుతున్న లేఖపై తెలంగాణ టీడీపీ స్పందించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పనిచేసేవారు ఎవ్వరూ ఇటువంటి హేయమైన పనులు చేయరని స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీమీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడింది తెలంగాణా టీడీపీ.

10TV Telugu News

NTR Trust Bhavan : హైదరాబాద్ నగరంలో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లీజు రద్దు చేయాలంటూ సర్క్యులేట్ అవుతున్న లేఖపై తెలంగాణ టీడీపీ స్పందించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పనిచేసేవారు ఎవ్వరూ ఇటువంటి హేయమైన పనులు చేయరని స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీమీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడింది తెలంగాణా టీడీపీ.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పని చేసే వారిని ప్రాంతాలవారిగా వేరు చేసి చూడమనీ..ఇక్కడ పని చేసే వారందరూ ఒక్కరే..ప్రాంతాలతో పనిలేదని స్పష్టంచేశారు. ఇటువంటి లేఖలను ఏమాత్రం పట్టించుకోవాల్సిన పనిలేదనీ..సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఈ ఫేక్ లెటర్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలంగాణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు తిరునగరి జోత్స్న,టి.టీడీపీ జనరల్ సెక్రటరీ
జి.వి.జి నాయుడు వెల్లడించారు.

కాగా..ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ట్రస్ట్ భవన్ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు సీఎం కేసీఆర్ లేఖ రాసారనీ.. ఎన్టీఆర్ భవన్ కు ఇచ్చిన లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని లేఖలో కేసీఆర్ కు విన్నవించినట్లుగా వార్తలు వచ్చాయి. ట్రస్ట్ పేరుతో టీడీపీ 30 ఏళ్లు లీజుకు తీసుకున్న ప్రభుత్వ స్థలాన్ని ట్రస్టుకు కాకుండా వ్యాపార కార్యకలాపాలను వినియోగిస్తోందని..ట్రస్టు భవన్ లో తెలంగాణ ఉద్యోగులను వేధిస్తున్నారని..కాబట్టి ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు ప్రభుత్వం ఇచ్చిన లీజును రద్దు చేయాలని..స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని లేఖలో ఉన్నట్లుగా సమాచారం.

ఎన్టీఆర్ ట్ర‌స్ట్ లో ఆంధ్రావారి పెత్త‌నం ఎక్కువ‌య్యింద‌ని…తెలంగాణ ఉద్యోగుల‌ను వేధిస్తున్నార‌ని..ట్ర‌స్ట్ లో ఎల్.ర‌మ‌ణ మాటకు విలువ లేకుండాపోతోందని లేఖలో రాసినట్లుగా సమాచారం. ఈలేఖపై స్పందించిన తెలంగాణ టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పనిచేసేవారు ఎవ్వరూ ఇటువంటి హేయమైన పనులు చేయరని స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీమీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అంటోంది తెలంగాణా టీడీపీ.

×