Telangana Rains: రాబోయే 24గంటల పాటు తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా మరో 3రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణా రాష్ట్రంలో ...

Telangana Rains: రాబోయే 24గంటల పాటు తెలంగాణలో భారీ వర్షాలు

Haevy Rains

Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా మరో 3రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం ఏర్పడిన గులాబ్ తుఫాన్ పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రా – దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతంలో కళింగపట్నం , గోపాల్ పూర్ మధ్యలో సోమవారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గాలి వేగం సుమారు గంటకు 75 నుండి 85 కిలోమీటర్ల వేగంతో అత్యధికంగా 95 కిలోమీటర్ల వేగంతో తీరం దాటే అవకాశం ఉంది.

ఈ ప్రభావంతో తెలంగాణా రాష్ట్రంలో ఒకట్రెండు ప్రదేశాలు మినహాయించి రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం, సోమవారం ఉరుములు, మెరుపులతో పాటు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

జగిత్యాల్, నిర్మల్, సిద్ధిపేట్, యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిర్మల్, నిజమాబాద్, జగిత్యాల్, మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, మెదక్, సిద్ధిపేట్, మేడ్చల్-మల్కాజ్ గిరి, యాదాద్రి భువనగిరి, జనగాం, మంచిర్యాల, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సాధారణ నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

ఈ మేర అధికారులు ఆయా ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేసి ఏర్పాట్లు చూసుకోవాలని సూచిస్తున్నారు.

రాగల 24 గంటల్లో ఈశాన్య, పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో తదుపరి 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్ తీరం దగ్గరకి సుమారుగా 29వ తేదీకి చేరుకునే అవకాశం ఉంది.