Telangana : పాలనపై సీఎం కేసీఆర్ ఫోకస్, ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు..ఎవరెవరు ఎక్కడకి

పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్. రానున్న రోజుల్లో మరింత మంది ఉన్నతాధికారులను కూడా బదిలీ చేయనున్నారు.

Telangana : పాలనపై సీఎం కేసీఆర్ ఫోకస్, ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు..ఎవరెవరు ఎక్కడకి

Ias Ips

Telangana Transfers of IAS, IPS : తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. పథకాల అమలుకు ప్రత్యేక చొరవ చూపే అధికారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యమంత్రి. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టారు. వివిధ శాఖల్లో లాంగ్ స్టాండింగ్‌గా ఉంటూ.. ఆరోపణలు ఉన్న, పని తీరు సరిగా లేని వారిని బదిలీ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఇంటిలిజెన్స్ నివేదికలు తెప్పించుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పించి.. కొందరికి స్థానభ్రంశం కూడా కల్పిస్తున్నారు. మూడు నెలల భువనగిరి కలెక్టర్‌గా ఉన్న అనితారామచంద్రన్‌ను బదిలీ చేశారు. ఆమె ప్లేస్‌లో భువనగిరి కలెక్టర్‌గా పమేల సత్పతిని నియమించారు. ఇక కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డిని ట్రాన్స్‌ఫర్ చేసి.. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది ప్రభుత్వం. రామగుండం సీపీ సత్యనారాయణను కరీంనగర్ సీపీగా బదిలీ చేసింది సర్కార్. ఇక రామగుండం సీపీగా ఏసీబీ చంద్రశేఖర్‌ను నియమించింది.

Read More : Gangavaram Port : అదానీ గ్రూప్‌ ఆధీనంలోకి గంగవరం పోర్టు

మరో నలుగురు ఐఏఎస్ ల బదిలీలు : –
తాజాగా మరో నలుగురు ఐఏఎస్‌ల బదిలీలు చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న శ్వేతామహంతీ స్టడీ లీవ్‌లో వెళ్లడంతో.. కలెక్టర్‌గా ఎల్.శర్మన్‌ను నియమించింది సర్కార్‌. అదే విధంగా మేడ్చల్ మల్కాజ్ గిరి ఫుల్ అడిషనల్ చార్జి కలెక్టర్‌గా హరీశ్‌ను నియమించింది ప్రభుత్వం. నాగర్‌కర్నూలు ఫుల్ అడిషనల్ చార్జి కలెక్టర్‌గా మను చౌదరినీ బదిలీ చేసింది. దళితబంధు పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సీఎంఓ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాకు పదోన్నతి కల్పించింది ప్రభుత్వం. ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌ను ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు రాహుల్ బొజ్జా. ఇటీవల వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా పీ.ప్రావిణ్యను.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా దివాకర టీఎస్‌ను.. ఆదిలాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా రిజ్వాన్ బాషాను బదిలీ చేసింది సర్కార్. వీరితో పాటు ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లకు పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం.

Read More : Banana Tree Leaves: అరటి ఆకులతో అద్భుతమైన ఆదాయం

లెవల్ 17 పే స్కేల్ : –
మరోవైపు.. లెవల్-17 పే స్కేల్ అమలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కే.రామకృష్ణరావుకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పదోన్నతి.. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ అడిషనల్ డీజీగా కొనసాగనున్న హరిప్రీత్ సింగ్‌ను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పదోన్నతి కల్పించింది. అరవింద్ కుమార్‌కు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పదోన్నతి ఇచ్చారు. పోలీస్ శాఖలోనూ భారీగానే బదిలీలు చేపట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. పదోన్నతులు కూడా కల్పించారు. ఎస్ఐబీ చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్‌గా ప్రభాకర్‌రావ్‌ కొనసాగనున్నారు. కొంతకాలంగా తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు చూసారాయన. తాజాగా ఇంటలిజెన్స్ చీఫ్‌గా అనిల్ నియామకంతో ఎస్ఐబీ బాధ్యతలు చూడనున్నారు ప్రభాకర్‌రావ్‌.

Read More : India Vs England : టీమిండియా చెత్త ప్రదర్శన, ఇంగ్లండ్ 42 పరుగుల ఆధిక్యం

సైబరాబాద్ సీబీ బదిలీ : –
సైబరాబాద్ సీబీగా ఉన్న సజ్జనార్‌ను బదిలీ చేసింది సర్కార్. దిశ కేసుతో పాటు పలు కీలక అంశంలో కూడా సజ్జనార్ మంచి పేరు తెచ్చుకున్నారు. లాంగ్ స్టాండింగ్‌గా ఉండటం, ఇంటిలిజెన్స్ నివేదికలు కూడా రావడంతో సజ్జనార్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీగా బదిలీ చేశారు. ఇక సైబరాబాద్ సీబీపీ స్టీఫెన్ రవీంద్రను నియమించారు. వీరితో పాటు రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌లకు డీజీపీ హోదా కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, ఉమేశ్‌ శరాఫ్, గోవింద్ సింగ్, రవి గుప్తాకు డీజీ హోదా పదోన్నతి కల్పించింది. అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ సీపీతో పాటు రాచకొండ సీపీని అతి త్వరలోనే బదిలీ చేసే అవకాశం ఉంది.

Read More : Congress : కాంగ్రెస్ లో కొత్త కుంపటి.. సీఎంపై తీవ్ర విమర్శలు చేసిన సిద్దు సలహాదారు

పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు సీఎం. రానున్న రోజుల్లో మరింత మంది ఉన్నతాధికారులను కూడా బదిలీ చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు నివేదికలు సిద్ధం చేశారు.