VC Ravinder Gupta dances : తెలంగాణ యూనివర్సిటీ వీసీ మరో నిర్వాకం .. డబ్బులు పంచుతూ విద్యార్థినులతో చిందులు..

తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తా వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. రెండు రోజుల క్రితం మహిళా ప్రొఫెసర్ ను వీసీని దుర్భాషలు ఆడిన ఘటన మరువకముందే అర్ధరాత్రి సమయంలో వీసీ వర్శిటీలోని గర్ల్స్ హాస్టల్ కు వెళ్లారు. తనతో పాటు మరికొందరు వ్యక్తులను గర్ల్స్ హాస్టల్ కు తీసుకెళ్లారు. విద్యార్ధులతో కలిసి డ్యాన్సులు వేశారు. నానా హంగామా చేశారు.

VC Ravinder Gupta dances : తెలంగాణ యూనివర్సిటీ వీసీ మరో నిర్వాకం .. డబ్బులు పంచుతూ విద్యార్థినులతో చిందులు..

University VC VC Ravinder Gupta dances

University VC VC Ravinder Gupta dances : తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తా వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. రెండు రోజుల క్రితం మహిళా ప్రొఫెసర్ ను వీసీని దుర్భాషలు ఆడిన ఘటన మరువకముందే వీసీ మరోసారి వార్తల్లోకెక్కారు. గణేశ్ నిమజ్జనం పూర్తి అయ్యాక వీసీ వర్శిటీలోని గర్ల్స్ హాస్టల్ కు వెళ్లారు. అంతేకాదు వీసీ రవీందర్ గుప్తా తనతో పాటు మరికొందరు వ్యక్తులను గర్ల్స్ హాస్టల్ కు తీసుకెళ్లారు. విద్యార్ధులతో కలిసి డ్యాన్సులు వేశారు. నానా హంగామా చేశారు. రాత్రి సమయంలో వీసీ గర్ల్స్ హాస్టల్ కు వెళ్లటమే కాకుండా నిబంధనలు వ్యతిరేకంగా బయటవ్యక్తులను కూడా తీసుకెళ్లటం విద్యార్ధులతో కలిసి డ్యాన్సులు వేయటం వివాదంగా మారింది. అంతటితో ఆగకుండా విద్యార్ధినులకు డబ్బులు పంచి మరీ డ్యాన్సులు వేయటం దుమారం రేపుతోంది. వీసీ తీరుపై విద్యార్ధినుల తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడతున్నారు.

పై తీవ్ర విమర్శలు ఎగురవుతున్నాయి. ఆయన చేసిన పనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. వెంటనే ఆయనపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. నిజామాబాద్‌లో నిన్న వినాయక నిమజ్జనం తర్వాత వర్సిటీ గర్ల్స్‌ హాస్టల్‌లో వీసీ డాన్సులు చేశారు. అనుమతి లేకున్నా వీసీతో పాటు హాస్టల్‌లోకి ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు వచ్చారని, హాస్టల్‌లో డాన్స్‌ చేస్తూ డబ్బులు పంచారని ఆరోపిస్తున్నారు.

వీసీ డాన్స్‌లు, డబ్బులు పంచడంపై విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే యూనివర్సిటీ వీసీ పనితీరుపై విద్యార్థి సంఘాలే కాకుండా పలువురు కూడా మండిపడుతున్నారు. విద్యార్థినులతో ఇలా వ్యహరిస్తూ డ్యాన్స్‌లు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

కాగా..వీసీ రవీందర్ గుప్తాపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విద్యార్ధి సంఘాలు గవర్నర్నర్ కు స్థానిక మంత్రికి ఫిర్యాదులు చేశారు. కానీ వీసీపై ఎటువంటి చర్యలుతీసుకోలేదు. దీంతో వీసీ మరింతగా రెచ్చిపోయిన తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అంటూ విద్యార్ది సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. అర్థరాత్రి సమయంలో గర్ల్స్ హాస్టల్ ను తాను వెళ్లటమే కాకుండా బయటవ్యక్తులను కూడా తీసుకెళ్లిన వీసిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.