Confusion : రెండు జిల్లాల సరిహద్దులో గ్రామం..రెండు లాక్‌డౌన్‌ రూల్స్ తో గందరగోళం

రెండు జిల్లాల మధ్య గ్రామం..రెండు రాష్ట్రాలకు సంబంధించిన గ్రామాలు..రెండు దేశాలకు కూడా సంబంధించిన గ్రామాలకు కొన్ని విషయాల్లో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఈ కరోనాకాలంలో విధించిన లాక్ డౌన్ నిబంధనలు జిల్లాలకు మధ్యా ఉన్న ఓ గ్రామానికి ఇబ్బందిగా మారాయి.రెండు రూల్స్ లో ఆ గ్రామ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అదే రంగారెడ్డి జిల్లా-నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఓ గ్రామం.

Confusion : రెండు జిల్లాల సరిహద్దులో గ్రామం..రెండు లాక్‌డౌన్‌ రూల్స్ తో గందరగోళం

Two Type Of Lock Down Rules Worry Village

Two type of lockdown rules worry village : రెండు జిల్లాల మధ్య గ్రామం..రెండు రాష్ట్రాలకు సంబంధించిన గ్రామాలు..రెండు దేశాలకు కూడా సంబంధించిన గ్రామాలకు కొన్ని విషయాల్లో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఈ కరోనాకాలంలో విధించిన లాక్ డౌన్ నిబంధనలు జిల్లాలకు మధ్యా ఉన్న ఓ గ్రామానికి ఇబ్బందిగా మారాయి.రెండు రూల్స్ లో ఆ గ్రామ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అదే రంగారెడ్డి జిల్లా-నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న మాల్‌ గ్రామం.

హైదరాబాద్‌–నాగార్జునసాగర్‌ రహదారిపై రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సరిహద్దుల్లో మాల్‌ గ్రామం ఉంది. రెండు జిల్లాల వారికి కూడా మాల్ గ్రామమే వ్యాపార కేంద్రం. మాల్ గ్రామంలో ప్రతి మంగళవారం పశువుల సంత జరుగుతుంది. ఈ పశువుల సంతకు రెండు జిల్లాల నుంచి జనాలు భారీగా వస్తారు. పశువుల అమ్మకం..కొనటం వంటి వ్యాపారం జరుగుతుంటుంది.

ఇటు రంగారెడ్డి.అటు నల్లగొండ జిల్లాల్లో ప్రస్తుతం వేర్వేరు లాక్‌డౌన్‌లు రూల్స్ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని మాల్‌లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండగా..అదే నల్గొండ జిల్లా పరిధిలోని మాల్‌లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం1 వరకూ లాక్‌డౌన్‌ అమలవుతుంది. అంటే నాలుగు గంటలు తేడా ఉంది. కానీ ఒకే గ్రామంలో పశువుల సంత. దీంతో గ్రామస్తులతో పాటు వ్యాపారులు కూడా అయోమయానికి గురవుతున్నారు. నల్గొండ జిల్లా పరిధిలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం వరకే వ్యాపార సంస్థలను మూసేస్తున్నారు. దీంతో సంతలో వ్యాపార లావాదేవీలకు ఇబ్బందిగా మారింది.