రాష్ర్ట రైతుబంధు క‌మిటీ ధ‌ర నిర్ణ‌యించాకే మార్కెట్లోకి ధాన్యం: కేసీఆర్

రాష్ర్ట రైతుబంధు క‌మిటీ ధ‌ర నిర్ణ‌యించాకే మార్కెట్లోకి ధాన్యం: కేసీఆర్

Telangana Vyavasaya Vedika:

బంగారు తెలంగాణ సాధించాలని మరోసారి పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రైతు వేదికలు, రైతు బంధు, ధరణి పోర్టల్ ప్రజాసంక్షేమం కోసమే పెట్టామని చెప్పారు. ఈ మేరకు రైతులంతా సంఘటితం కావాలని సూచించారు.

ఎవరికి వారే ఉంటే నష్టపోతారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. కూర‌గాయలు, ధాన్యం వాటి ధ‌ర‌లు ద‌ళారీల చేతుల్లోకి పోకుండా జాగ్రత్త వ్యవహరించాలి. ఇవ‌న్నీ తొల‌గిపోవడానికే రైతు వేదిక‌లు ఏర్పాటు చేశాం. ఇవి దేశానికే ఆద‌ర్శంగా నిల‌ుస్తాయి. మేం ఏర్పాటు చేసిన దాని కంటే రెట్టింపు సంఖ్యలో మీరే నిర్మించుకుంటారు. ఆ రోజులు వచ్చి తీరతాయి.



తెలంగాణ‌లో రైతు రాజ్యం వ‌చ్చి తీరుత‌ుంది. రాష్ర్ట రైతుబంధు క‌మిటీ ధ‌ర నిర్ణ‌యించిన త‌ర్వాతనే మార్కెట్లోకి వెళ్లాలి. అప్పుడే రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు వ‌స్తాయి. తెలంగాణ రైతాంగ‌మంతా కొన్ని విష‌యాల‌ను సీరియ‌స్‌గా తీసుకోవాలి. సీఎంగా బాధ్యతలు తీసుకున్న సమయానికి వ్య‌వ‌సాయ శాఖ‌ను పూర్తిగా నాశనం చేసేశారు. ఇప్పుడు వ్య‌వ‌సాయ శాఖ‌లో మార్పులు చేశాం. వ్య‌వ‌సాయ శాఖ అద్భుతంగా ప‌ని చేస్తుంది.

ఈ వేదిక‌లు యాక్టివ్‌గా ఉండేలా రైతు బంధు క‌మిటీలు నాయ‌క‌త్వం వ‌హించాలి. 50 నుంచి 60 శాతం మంది ప్ర‌జ‌ల‌కు ఇవే బ‌తుకుదెరువు. ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్ పెడితే స్ప‌ష్టంగా చెప్పేశా. ఏదేమైనా.. మ‌న దేశ ప‌రిస్థితి ఏవి నిలుపుద‌ల చేసినా, వ్య‌వ‌సాయం ఆప‌కూడ‌ద‌ని చెప్పా. 200 పైచిలుకు దేశాలున్న ప్ర‌పంచంలో.. తెలంగాణ రాష్ర్టం కంటే చిన్న‌గా ఉన్నవి 180 దేశాలు.

ఎట్టి ప‌రిస్థితుల్లో ఆహార రంగంలో స్వ‌యం శ‌క్తి ఉండాల‌ని సూచించా. చాలా సీఎంలు నిజ‌మ‌నే చెప్పారు. అన్నం పెట్టే శ‌క్తి ప్ర‌పంచంలో ఎవ‌రికీ లేదు. ఎప్పుడు ప‌రిస్థితులు ఒకేలా ఉండ‌వు. అన్నం పెట్టే శ‌క్తి కేవ‌లం తెలంగాణ‌కు మాత్ర‌మే ఉంద‌న్నారు.