Bengaluru : బెంగళూరులో తెలంగాణ యువతి అనుమానాస్పద మృతి.. ప్రియుడే హంతకుడు?

Bengaluru : ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్న ఆకాంక్షను విడిగా ఉండాలని ఒత్తిడి తెచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

Bengaluru : బెంగళూరులో తెలంగాణ యువతి అనుమానాస్పద మృతి.. ప్రియుడే హంతకుడు?

Bengaluru (Photo : Google)

Bengaluru – Suspicious Death : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిఖనికి చెందిన యువతి ఆకాంక్ష బెంగళూరులో హత్యకు గురైంది. ప్రేమే ఇందుకు కారణం అని అనుమానిస్తున్నారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా జాబ్ చేస్తున్న ఆకాంక్షను ఆమె ప్రియుడు అర్పిత్ హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తవుతున్నాయి.

జీవనబీమానగర పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడిహళ్లిలో ఉంటోంది. ఆకాంక్ష హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారాంతంలో బెంగళూరు వెళ్లి ఆకాంక్ష ఫ్లాట్ లోనే ఉండేవాడు. కాగా, ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్న ఆకాంక్షను విడిగా ఉండాలని ఒత్తిడి తెచ్చాడు.(Bengaluru)

Also Read..Family Disallows Marriage : ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని ప్రేయసీ, ప్రియులు ఏం చేశారంటే…

ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో రగిలిపోయిన అర్పిత్ తన ప్రియురాలు ఆకాంక్షను గొంతు నులిమి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆపై ఉరేసి పారిపోయాడని చెబుతున్నారు. విగతజీవిగా పడి ఉన్న ఆకాంక్షను చూసి షాక్ తిన్నారు రూమ్స్ మేట్స్. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బెంగళూరు వెళ్లి ఆకాంక్ష మృతదేహాన్ని గోదావరిఖనికి తరలించారు. కర్నాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. అర్పిత్ ది ఢిల్లీ కావడంతో అక్కడికి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిపై నిఘా పెట్టారు. మొబైల్ ఫోన్ ను ట్రాక్ చేస్తున్నారు.(Bengaluru)

Also Read..Mumbai College girl : ముంబయి కాలేజీ హాస్టల్లో దారుణం

అర్పిత్, ఆకాంక్ష మధ్య నాలుగేళ్లుగా పరిచయం ఉంది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం. అయితే ఆకాంక్ష తల్లిదండ్రులు దీని గురించి ఎలాంటి సమాచారం లేదు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి తమకేమీ తెలియదంటున్నారు. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్పలేకపోతున్నారు. అర్పిత్, ఆకాంక్ష సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వీకెండ్ లో వీరిద్దరు కలుసుకుంటున్నట్లుగా ఆకాంక్ష స్నేహితులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే సోమవారం కూడా అర్పిత్, ఆకాంక్ష బెంగళూరులో ప్లాట్ లో కలిసున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అర్పిత్.. ఆకాంక్షను హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఆకాంక్ష, అర్పిత్ కు మధ్య ఎలాంటి గొడవ జరిగింది? పోలీసుల విచారణలో ఇంకా వెల్లడికాలేదు. ఆకాంక్ష కుటుంబసభ్యులు కూడా పూర్తి సమాచారం చెప్పలేకపోతున్నారు.

Rajasthan : చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లి పిల్లలపై హెడ్‌మాస్టర్ అఘాయిత్యం, ఆ వీడియోలకు బానిసగా మారి ఇలా..

అర్పిత్.. ఆకాంక్ష గొంతునులిమి ఆ తర్వాత ఉరివేసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడి నుంచి పరార్ అయిన అర్పిత్.. తన మొబైల్ ను ఆకాంక్ష ప్లాట్ లోనే మర్చిపోయాడు. ఇదే నిందితుడిని పట్టించిందని చెప్పుకోవచ్చు. అప్పటికే ఆకాంక్ష మిత్రులు ఇచ్చిన సమాచారం, ఆకాంక్ష ప్లాట్ లో అర్పిత్ ఫోన్ దొరకడం.. ఇవన్నీ కలిసి.. ఆకాంక్షను అర్పిత్ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.(Bengaluru)