YS Sharmila: పోలీసు శాఖపై కేసు వేస్తాం.. పాదయాత్ర మళ్ళీ ప్రారంభిస్తా: షర్మిల

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. పోలీసు శాఖపై కేసు వేస్తానని, తాను ఎక్కడైతే పాదయాత్రను ఆపానో మళ్ళీ అక్కడి నుంచే సంక్రాంతి నుంచి తన యాత్రను ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. ఇవాళ ఆమె హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ హవా, పోలీసుల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. తనను ఇంటి నుంచి వెళ్లకుండా చేసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

YS Sharmila: పోలీసు శాఖపై కేసు వేస్తాం.. పాదయాత్ర మళ్ళీ ప్రారంభిస్తా: షర్మిల

YS Sharmila

YS Sharmila: తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. పోలీసు శాఖపై కేసు వేస్తానని, తాను ఎక్కడైతే పాదయాత్రను ఆపానో మళ్ళీ అక్కడి నుంచే సంక్రాంతి నుంచి తన యాత్రను ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. ఇవాళ ఆమె హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ హవా, పోలీసుల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. తనను ఇంటి నుంచి వెళ్లకుండా చేసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని కేసులు పెట్టారని అన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘన కేసులో రిమాండ్ కు అడిగారని చెప్పారు. తన సహనాన్ని పోలీసులు పరీక్షిస్తున్నారని, తనను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. పోలీసు శాఖపై కేసు వేయాలని తమ పార్టీ నిర్ణయించిందని చెప్పారు. తాను ఆమరణ నిరాహార దీక్ష చేయకుండా, దీక్షను భగ్నం చేసి ఇంటి నుంచి వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు.

తనను ఇబ్బందులకు గురి చేయడానికి పోలీసులను టీఆర్ఎస్ వాడుకుంటోందని షర్మిల చెప్పారు. తాను ఎంత సహనంగా ఉన్నా పోలీసుల వేధింపులు ఆగడం లేదని చెప్పారు. ‘అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానని అన్నాడు అంట కేసీఆర్ లాంటివారు’ అంటూ బీఆర్ఎస్ పై షర్మిల విమర్శలు గుప్పించారు.

కాగా, కొన్ని రోజుల క్రితం వరంగల్ లోని చెన్నారావుపేటలో షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. శంకరం తండా శివారులో షర్మిల కేరవాన్‌కు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పంటించడం, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో కలకలం చెలరేగింది. మళ్ళీ ఆ ప్రాంతం నుంచే పాదయాత్ర ఉంటుందని షర్మిల అంటున్నారు.

FIFA World Cup 2022: మేము సెమీఫైనల్లో గెలిచి ఫైనల్ చేరడానికి కారణం ఇదే..: అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ