Telangana : తలసరి ఆదాయం రెట్టింపైంది.

ఒక దేశం కానీ.. లేదంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పాలి అంటే తలసరి ఆదాయమే ప్రామాణిక. తలసరి ఆదాయం పెరుగుతుందంటే దేశ ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అర్ధం.

Telangana : తలసరి ఆదాయం రెట్టింపైంది.

Telangana (4)

Telangana :  ఒక దేశం కానీ.. లేదంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పాలి అంటే తలసరి ఆదాయమే ప్రామాణిక. తలసరి ఆదాయం పెరుగుతుందంటే దేశ ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అర్ధం. గత ఏడేళ్లలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం దాదాపు రెట్టింపయ్యింది, 2014లో రూ. 1,24,104గా ఉన్న తలసరి ఆదాయం ఏడేండ్లలో 91.5% వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.2,37,632కు పెరిగింది. ఇది జాతీయ సగటు (రూ.1,28,829) కంటే 1.84 రెట్లు అధికం. దీంతో దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.

చదవండి : Telangana : సీఎం కేసీఆర్ డిమాండ్స్ ఇవే..కేంద్రం వెంటనే స్పందించాలి

ప్రజల ఆదాయం పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి మార్కెట్లో వస్తువు డిమాండును పెంచుతుంది. వస్తువు డిమాండ్ పెరిగితే ఆటోమాటిక్‌గా ఉత్పత్తి పెరుగుతుంది. సేవారంగం అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి ఫలాలు అందరూ అనుభవిస్తే మళ్లీ తలసరి ఆదాయం పెరిగి కుటుంబం, దేశం సుసంపన్నం అవుతుంది.

చదవండి : Telangana Rains : తెలంగాణలో తేలికపాటి వర్షాలు.. రాబోయే 3 రోజులు జాగ్రత్త!