Ramappa Temple : రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు

తెలంగాణలోని చారిత్రక దేవాలయం ప్రపంచ వారసత్వహోదా దక్కించుకుంది. తెలంగాణలోని పాలంపేటలో రామప్ప ఆలయాన్ని 13 శతాబ్దంలో నిర్మించారు. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వసంపదగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని రకాల డాక్యూమెంట్లను యునెస్కోకు పంపింది.

Ramappa Temple : రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు

Unesco

Ramappa Temple : తెలంగాణలోని చారిత్రక దేవాలయం ప్రపంచ వారసత్వహోదా దక్కించుకుంది. తెలంగాణలోని పాలంపేటలో రామప్ప ఆలయాన్ని 13 శతాబ్దంలో నిర్మించారు. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వసంపదగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని రకాల డాక్యూమెంట్లను యునెస్కోకు పంపింది. వాటిని పరిశీలించిన కమిటీ రామప్ప దేవాలయానికి వారసత్వ హోదాను కట్టబెట్టింది. ఈ విషయంలో నార్వే అడ్డుకునేందుకు ప్రయత్నించింది. రష్యా భారత్ కు సపోర్ట్ చేసింది.

కాకతీయ అద్భుత శిల్పకళకు నిదర్శనం ఈ దేవాలయం. ఈ దేవాలయం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. భారత్ లో యునెస్కో గుర్తించిన వారసత్వ సంపదల్లో రామప్ప దేవాలయం 39 సైట్ గా రామప్ప దేవాలయం ఉంది. చైనాలో 44వ వరల్డ్ హెరిటేజ్ యునెస్కో సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం రామప్పకు సంబందించిన అన్ని డాక్యూమెంట్లను కమిటీకి పంపింది. ఇంజినీరింగ్ నైపుణ్యానికి కళా సౌందర్యానికి చెక్కుచెదరని సాక్ష్యం రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుడి సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు నిర్మించారు. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.

ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుడుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం, దైవంపేరు మీదుగా కాక ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా పిలుస్తుంటారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. విష్ణువు ఆవతారం రాముడు, శివుడు కలిసి ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన మూడు వైపుల ప్రవేశ ద్వారంతో కలిగి మహామండపం ఉంది.