Telugu Akademi Scam : మరో కీలక సూత్రధారి అరెస్ట్.. పరిచయం చేశాడు, రూ.64లక్షలు సంపాదించాడు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో పోలీసులు మరొక కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు. గుంటూరు‌లో సాంబశివరావును అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు..

Telugu Akademi Scam : మరో కీలక సూత్రధారి అరెస్ట్.. పరిచయం చేశాడు, రూ.64లక్షలు సంపాదించాడు

Telugu Akademi Scam

Telugu Akademi Scam : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో పోలీసులు మరొక కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు. గుంటూరు‌లో సాంబశివరావును అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు.. హైదరాబాద్‌ కి తరలిస్తున్నారు. బ్యాంక్ మేనేజర్లు‌ను సాయి కుమార్‌కి పరిచయం చేసి సాంబశివరావు కమీషన్ తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. సాధన, మస్తాన్ వలిని సాయి కుమార్‌కి పరిచయం చేసింది సాంబశివరావే. బ్యాంక్ మేనేజర్లను పరిచయం చేసినందుకు సాంబశివరావు రూ.64 లక్షలు కమీషన్ తీసుకున్నాడు. ఇక ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలంగాణలోనే కాదు ఏపీలోనూ తెలుగు అకాడమీ అక్రమార్కులు దోచేశారు. ఏపీలో రెండు ప్రభుత్వ సంస్థల నుంచి సాయి కుమార్ గ్యాంగ్ రూ.15 కోట్లు కొట్టేసినట్లు గుర్తించారు. ఏపీ గిడ్డంగుల శాఖ నుంచి 9.60 కోట్లు, ఏపీ ఆయిల్ ఫెడ్‌ నుంచి రూ.5 కోట్ల ఎఫ్‌డీలు గల్లంతయ్యాయి. భవానిపురం IOB లోని గిడ్డంగుల కార్పొరేషన్ FD నుంచి రూ.9.60.కోట్లు నిందితులు కొట్టేశారు. ఇప్పటికే స్పందించిన బ్యాంక్ ఉన్నతాధికారులు కార్పొరేషన్ అమౌంట్ వెనక్కి ఇచ్చేస్తామని చెప్పినట్లు సమాచారం. బ్యాంక్ ఉద్యోగుల ప్రమేయంపై అంతర్గత దర్యాప్తు జరుపుతున్నారు. కృష్ణా జిల్లా లోని సప్తగిరి బ్యాంక్ నుంచి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కు చెందిన 5 కోట్ల FD లను కొట్టేశారు.

Honey : టీలో తేనె కలుపుకుంటున్నారా! ఏం జరుగుతుందో తెలుసా?

తెలుగు అకాడమీ నిధుల కుంభకోణంపై జరుగుతున్న విచారణలో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు(ఎఫ్‌డీ) కాజేసిన కేసు సూత్రధారి చుండూరి వెంకటసాయి కుమార్‌ ఈ స్కామ్‌ కోసం నకిలీ బాండ్లను వినియోగించినట్లు వెల్లడైంది. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలసి కొండాపూర్‌లోని సైబర్‌ రిచ్‌ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసుకున్న అడ్డాలో ఈ బాండ్లను తయారు చేయించాడనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఏడాది క్రితమే సాయి కన్నుపడింది.

వెంకటరమణను రంగంలోకి దింపి, అకాడమీకి-వివిధ బ్యాంకులకు మధ్య దళారులుగా ఉండేవారి కోసం ఆరా తీశాడు. భూపతిరావు ఈ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నట్లు తెలుసుకొని వెంకటరమణ ద్వారా అతడికి ఎర వేశాడు. తన అనుచరులైన ఆర్‌ఎంపీ డాక్టర్‌ వెంకట్, సోమశేఖర్‌ను రంగంలోకి దిం పాడు. వీళ్లు గతంలో సాయి చేసిన కొన్ని స్కామ్‌లలోనూ పాలుపంచుకున్నట్లు వెల్లడైంది.

Home Pollution : ముప్పుగా మారబోతున్న ఇంటి కాలుష్యం

వెంకట్, సోమశేఖర్‌లు అకాడమీ అధికారుల దగ్గరికి వెళ్లినప్పుడు బ్యాంకు ప్రతినిధులమని, బ్యాంకు అధికారులను కలిసినప్పుడు అకాడమీ ప్రతినిధులమని చెప్పుకుని కథ నడిపారు. అకాడమీ అధికారులు నగదును ఎఫ్‌డీ చేసే సమయంలో ఆ మొత్తానికి సంబంధించిన చెక్కుతోపాటు నిర్ణీత కాలానికి ఎఫ్‌డీ చేయాలని కోరుతూ బ్యాంకు అధికారులకు ఓ కవరింగ్‌ లెటర్‌ను సిద్ధం చేసేవాళ్లు. వీటిని భూపతిరావు తీసుకుని ఆ వివరాలను సాయికి చెప్పేవాడు. దీంతో సాయి ఓ నకిలీ కవరింగ్‌ లెటర్‌ రూపొందించి బ్యాంకు అధికారులు ఇచ్చేదాని స్థానంలో ఉంచేవాడు.

అందులో ఆ మొత్తాన్ని ఏడాది కాలానికి కాకుండా వారం రోజులకే ఎఫ్‌డీ చేయాలంటూ రాసేవాడు. బ్యాంకు అధికారులు ఇచ్చిన అసలు ఎఫ్‌డీ బాండ్లను తమిళనాడుకు చెందిన మదన్, పద్మనాభన్‌కు అందించేవాడు. వీటిని స్కాన్‌ చేసి ఆపై కంప్యూటర్‌లో ఫొటోషాప్‌ సాప్ట్‌వేర్‌లో ఎడిట్‌ చేస్తూ ఏడాది కాలానికి ఎఫ్‌డీ చేసినట్లు రూపొందించేవారు. బాండ్‌ పేపర్లపై ప్రింట్‌ ఔట్‌ తీసి నకిలీబాండ్లు తయారు చేసేవారు. వీటినే అకాడమీ అధికారులకు సాయి అందేలా చేసేవాడు.

తెలుగు అకాడమీ నిధులు కోట్లాది రూపాయల మేర గల్లంతైన వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాయికుమార్ కోట్లు కొల్లగొట్టినట్టు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. సాయికుమార్, అతని అనుచరులు గత పదేళ్ల కాలంలో సుమారు రూ.200 కోట్ల వరకు స్వాహా చేసినట్టు గుర్తించారు. సాయికుమార్ ముఠా ప్రభుత్వ సంస్థల ఫిక్స్ డ్ డిపాజిట్లను కొల్లగొట్టడంలో ఆరితేరినట్టు వెల్లడైంది.

సాయికుమార్, అతని అనుచరులు 12 ఏళ్ల క్రితం ఓ ముఠాగా ఏర్పడ్డారు. సాయికుమార్ బృందంపై ఇప్పటికే 7 కేసులు ఉన్నాయి. సాయికుమార్ గతంలో స్వాల్ కంప్యూటర్స్ పేరిట ఓ సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహించాడు. చెన్నైకి చెందిన నేరస్తులతో అతడికి పరిచయాలు ఏర్పడ్డాయి. క్రమంగా వీరు ఓ ముఠాగా ఏర్పడి, బ్యాంకు అధికారులతో పరిచయాలు పెంచుకుని ఫిక్స్ డ్ డిపాజిట్లు గోల్ మాల్ చేయడం ప్రారంభించారు.

జాతీయ, కార్పొరేట్, సహకార బ్యాంకు మేనేజర్లతో ఈ ముఠాకు పరిచయాలు ఉన్నాయి. తమ గోల్ మాల్ వ్యవహారంలో పలువురు బ్యాంకు మేనేజర్లను కూడా భాగస్వాములుగా చేశారు. కమీషన్ల ఆశ చూపి ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఫిక్స్ డ్ డిపాజిట్లను కొల్లగొట్టారు. ఒప్పందం చేసుకున్న బ్యాంకుల్లోనే ప్రభుత్వ శాఖల ఫిక్స్ డ్ డిపాజిట్లు గోల్ మాల్ చేసేలా ప్రణాళిక రచించారు. ఈ కేసులో కీలక సూత్రదారిగా సాయికుమార్‌.