Telugu Must : సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ స్కూల్స్‌లోనూ తెలుగు తప్పనిసరి.. ప్రభుత్వం ఆదేశాలు
ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Telugu Must : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు భాషకు పట్టం కట్టింది. రాష్ట్రంలోని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ స్కూల్స్‌లోనూ తెలుగు భాషను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
బోర్డులు, బోధనా మాధ్యమంతో సంబంధం లేకుండా తెలుగును బోధించాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2018-19 నుంచి దశలవారీగా తెలంగాణ (పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి బోధన, అభ్యాసం) చట్టం 2018 అమల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. భావి తరాలకు ఉపయోగపడేలా తెలుగు భాష, సాహిత్యాన్ని పరిరక్షించేందుకు అన్ని పాఠశాలల్లో మాతృభాషను తప్పనిసరి చేశారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
గత విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు తెలుగు భాష బోధనను తప్పనిసరి చేశారు. ఈ విద్యా సంవత్సరం అంటే 2022-23లో అన్ని పాఠశాలల్లో 1-10వ తరగతి వరకు తెలుగును ఒక భాషగా అమలు చేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు మాతృభాష కాని పిల్లల కోసం 1-5వ తరగతి వరకు ‘తేనెపలుకులు’, 6 -10వ తరగతి వరకు ‘వెన్నెల’ పేరుతో పాఠ్య పుస్తకాలను రూపొందించారు. తెలుగు మాతృభాషగల విద్యార్థుల కోసం ప్రామాణిక పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచారు. 1-5వ తరగతి వరకు ‘జాబిలి’.. 6,7,8 తరగతుల కోసం ‘నవ వసంతం’.. 9,10వ తరగతులకు ‘సింగిడి’ పేరుతో పుస్తకాలను రూపొందించారు. ఈ పుస్తకాలు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి ఎస్సీఈఆర్టీ వెబ్సైట్ http://scert.telangana.gov.in లో అందుబాటులో ఉంచారు.
తెలుగు భాష బోధన విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామంది. తప్పు చేసిన యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీచేస్తామని, జరిమానా విధించడం లేదా గుర్తింపు రద్దు చేయడం లాంటి కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
- CM KCR: కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు.. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
- TRS Support : రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కీలక నిర్ణయం..ఆయనకే గులాబీ మద్దతు!
- రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కీలక మంతనాలు
- CM KCR : సీఎం కేసీఆర్ సతీమణికి అస్వస్థత.. యశోద ఆసుపత్రిలో చికిత్స
- IIIT Basara Students Protests : బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆడియో కలకలం
1Khairatabad Ganesh Idol Poster : మొదటిసారి మట్టితో ఖైరతాబాద్ వినాయకుడు.. నమూనా ఇదిగో.. ఎత్తు ఎంతో తెలుసా
2Covid-19 : హైదరాబాద్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులు
3Amala Paul: అందాల అమలా.. ఇంత కైపుగా చూస్తే ఎలా?
4Viral Video : కొబ్బరి కాయ ఎంత పనిచేసింది.. బైక్‌పై వెళ్లే మహిళ తలపై పడింది.. అంతే.. షాకింగ్ వీడియో!
5Presidential Polls: యశ్వంత్ సిన్హా ఫోన్ చేశారు.. ఆయనకే ఓటు వేస్తాం: అసదుద్దీన్
6Agent: ఏజెంట్ ట్విస్టుకు ఫ్యూజులు ఎగరాల్సిందేనా..?
7YS Jagan Mohan Reddy : పారిస్ పర్యటనకు వెళుతున్న ఏపీ సీఎం జగన్
8ukraine: 1,000 మంది ఉన్న షాపింగ్ మాల్‌పై రష్యా క్షిపణి దాడి
9Kiara Advani: నలుపు చీరలో కియారా.. ఫిదా అవ్వకుండా ఉంటారా!
10Kolkata Student : జేయూ విద్యార్థికి 3 జాబ్ ఆఫర్లు.. గూగుల్, అమెజాన్ వద్దన్నాడు.. ఫేస్బుక్లో భారీ ప్యాకేజీ కొట్టేశాడు!
-
Maa Neella Tank: ఆకట్టుకుంటున్న మా నీళ్ల ట్యాంక్ టీజర్.. ఇది ఒరిజినల్!
-
OnePlus 10T 5G : వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Nagarjuna: ‘సర్దార్’ను పట్టేసుకున్న నాగార్జున!
-
Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి!
-
Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?
-
Swathimuthyam: నీ చారెడు కళ్లే.. అంటూ పాటందుకున్న స్వాతిముత్యం!
-
Zee Telugu: జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఆడిషన్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే?
-
China Solar Plant : డ్రాగన్ దూకుడు.. 2028 నాటికి అంతరిక్షంలో చైనా ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్..!