Telugu States By-poll: నేడు తేలనున్న హుజురాబాద్, బద్వేల్ నేతల భవితవ్యం

తెలుగు రాష్ట్రాలలో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు జరగనుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగిన తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ నేతల భవితవ్యం నేడు తేలనుండగా.. ఏపీలోని..

Telugu States By-poll: నేడు తేలనున్న హుజురాబాద్, బద్వేల్ నేతల భవితవ్యం

Telugu States By Poll (1)

Telugu States By-poll: తెలుగు రాష్ట్రాలలో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు జరగనుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగిన తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ నేతల భవితవ్యం నేడు తేలనుండగా.. ఏపీలోని కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు కూడా నేడే వెలువడనున్నాయి. మరికాసేపట్లో.. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో హుజురాబాద్ స్థానానికి కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే ఓట్లు నిక్షిప్తమైన ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లో నుంచి కౌంటింగ్ హాల్లోకి తరలించారు.

ముందుగా 8 గంటలకు 753 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలు పెట్టనున్న అధికారులు.. 8.30కి ఈవీఎంల కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియలో మొత్తం 14 టేబుల్స్.. 22 రౌండ్స్ లో లెక్కింపు పూర్తి చేయనున్నారు. ముందుగా హుజురాబాద్ మండలానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్న అధికారులు.. మొదటి పోలింగ్ స్టేషన్ పోతిరెడ్డి పేట కాగా చివరగా శంబునిపల్లి పోలింగ్ బూత్ ఈవీఎంను లెక్కించనున్నారు. కౌంటింగ్ సందర్భంగా కరీంనగర్-జగిత్యాలకు ట్రాఫిక్ మల్లింపు చేపట్టారు.

మరోవైపు మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలోని కడప జిల్లా.. బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. పట్టణ శివార్లలోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులు ఉండగా.. ప్రధానంగా వైసీపీ బీజేపీ మధ్య పోటీ నెలకొనగా.. నాలుగు కౌంటింగ్ హాల్స్ లో 28 టేబుళ్ల ఏర్పాటు చేశారు. కౌంటింగ్ మొదలైతే మూడు, నాలుగు గంటల్లోనే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది.

తోలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలు పెట్టనుండగా.. మొత్తం 914 పోస్టల్ బ్యాలెట్స్ కు గాను 235 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ లో 249 మంది సిబ్బంది పాల్గొననుండగా.. మొత్తం ఓట్లు 2,15, 292కు గాను.. మొత్తం పోలైన ఓట్లు 1, 46, 660. ఒకవైపు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుండగా.. మరోవైపు జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. కౌంటింగ్ కు వర్షం ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేసిన అధికారులు కేంద్ర పారా మిలటరీ దళాల తో పాటు నాలుగు వందల మందిపోలీసులుతో భద్రత ఏర్పాటు చేయడంతో పాటు కౌంటింగ్ కేంద్రానికి సమీపంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.