Covaxin : తెలంగాణలో కోవాగ్జిన్ టీకాకు తాత్కాలిక బ్రేక్

వ్యాక్సిన్ల కొర‌త రాష్ట్రాల‌ను వెంటాడుతూనే ఉంది. చాలా రాష్ట్రాల్లో టీకా ప్రక్రియ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. తెలంగాణ‌లోనూ అదే ప‌రిస్థితి. దీంతో కీల‌క నిర్ణయం తీసుకుంది తెలంగాణ స‌ర్కార్. తెలంగాణలో కోవాగ్జిన్‌ టీకాకు తాత్కాలిక బ్రేక్ వేస్తున్నట్లు చెప్పింది.

Covaxin : తెలంగాణలో కోవాగ్జిన్ టీకాకు తాత్కాలిక బ్రేక్

Covaxin

Covaxin Vaccine In Telangana : వ్యాక్సిన్ల కొర‌త రాష్ట్రాల‌ను వెంటాడుతూనే ఉంది. చాలా రాష్ట్రాల్లో టీకా ప్రక్రియ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. తెలంగాణ‌లోనూ అదే ప‌రిస్థితి. దీంతో కీల‌క నిర్ణయం తీసుకుంది తెలంగాణ స‌ర్కార్. తెలంగాణలో కోవాగ్జిన్‌ టీకాకు తాత్కాలిక బ్రేక్ వేస్తున్నట్లు చెప్పింది.

45 ఏళ్లకు పైబడిన వాళ్లకు కూడా రెండో డోస్ వేసేందుకు స్టాక్‌ లేదని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. కోవాగ్జిన్ సప్లై తగినంత లేకపోవడంతో రెండో డోస్‌ను ఇప్పట్లో వేయలేమని తేల్చేసింది. కేంద్రం నుంచి కోవాగ్జిన్ స్టాక్ రాలేద‌ని ప్రక‌టించిన సర్కార్‌.. మ‌ళ్లీ వ్యాక్సినేష‌న్ ఎప్పుడ‌నేది త్వర‌లోనే ప్రక‌టిస్తామ‌ని చెప్పింది.

ఈ నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినా.. వ్యాక్సిన్ల కొర‌త‌తో అది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు. ఈ స‌మ‌యంలో.. రెండో డోసుల‌కు ప్రాధాన్యం ఇస్తూ వ‌చ్చింది స‌ర్కార్. కానీ, ఇప్పుడు వ్యాక్సిన్ల కొర‌త కార‌ణంగా.. రెండో డోసు వ్యాక్సినేష‌న్‌ను కూడా నిలిపివేసింది.

ఇప్పటికే శ‌ని, ఆదివారాల్లో వ్యాక్సినేష‌న్ నిలిపివేసిన స‌ర్కార్.. ఇప్పుడు ఈ తాజా ప్రక‌ట‌న చేసింది. మరోవైపు ఇప్పటికే 45 ఏళ్లు పైబడిన వాళ్లకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం టీకాలు వేస్తోంది. అది కూడా రెండో డోస్ వాళ్లకు మాత్రమే. ఇప్పుడు కోవాగ్జిన్‌ రెండో డోస్‌ కూడా ఆగిపోయింది. దీంతో కొవిషీల్డ్‌ మాత్రమే అందుబాటులో ఉండనుంది.

Read More : సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ చైర్మన్ పదవికి షాహిద్ జమీల్ రాజీనామా