స్కూళ్లు, కాలేజీలు మూసేసినా.. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరించకుండా స్కూళ్లు, కాలేజీలు,

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 11:04 AM IST
స్కూళ్లు, కాలేజీలు మూసేసినా.. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరించకుండా స్కూళ్లు, కాలేజీలు,

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ పట్ల తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 31వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. శనివారం(మార్చి 14,2020) సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైలెవల్ కమిటీ సమావేశం జరిగింది. కరోనా వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 31వ తేదీ వరకు విద్యా సంస్థలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నా.. పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారమే టెన్త్ క్లాస్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని డెసిషన్ తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.50 లక్షల మంది టెన్త్‌ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలకపోయినా…ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. వారందరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఒక వ్యక్తి పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నాడు. అతడిని గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే. మరో పేషెంట్ (ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తి)కి పాజిటవ్ రావడం, మరో ఇద్దరికి కరోనా లక్షణాలున్నాయని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జన సమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాపించడానికి అవకాశం ఎక్కువ. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు.. విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసివేత నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో షట్ డౌన్ నిర్ణయం తీసుకున్నాయి.