Terrorist Links : నిజామాబాద్‌ జిల్లాలో ఉగ్రవాద లింకులు కలకలం

నిజామాబాద్‌ జిల్లాలో ఉగ్రవాద లింకులు కలకలం రేపుతున్నాయి. ఆర్మూర్‌లో ఐసిస్‌ ఉగ్రవాద లింకులు వెలుగు చూడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్మూర్‌ జిరాయత్‌నగర్‌కు చెందిన షేక్‌ నవీద్‌కు ఐసిస్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని భావించి.. ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి నిధుల రాకపై ఆరా తీశారు.

Terrorist Links : నిజామాబాద్‌ జిల్లాలో ఉగ్రవాద లింకులు కలకలం

Armoor

Terrorist links : నిజామాబాద్‌ జిల్లాలో ఉగ్రవాద లింకులు కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్‌లో ఉగ్రవాద ముసుగులో యువతకు కరాటే నేర్పించిన విషయంలో ఇంకా విచారణ సాగుతుండగానే.. ఆర్మూర్‌లో ఐసిస్‌ ఉగ్రవాద లింకులు వెలుగు చూడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్మూర్‌ జిరాయత్‌నగర్‌కు చెందిన షేక్‌ నవీద్‌కు ఐసిస్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని భావించి.. ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి నిధుల రాకపై ఆరా తీశారు.

షేక్ నవీద్‌ ఓ చికెన్‌ సెంటర్‌లో పని చేసేవాడు. రెండు నెలల క్రితం పని మానేశాడు. అతడికి పాకిస్థాన్‌ నుంచి ఫోన్‌ కాల్స్‌తో పాటు నిధులు అందుతున్నాయని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఐఏ టీమ్.. జిరాయత్‌నగర్‌ ప్రాంతంలో నిఘా పెట్టింది. నిర్మల్‌ జిల్లా బైంసాకు వెళ్లిన నవీద్‌.. మధ్యాహ్న సమయంలో ఇంటికి చేరుకోగానే అదుపులోకి తీసుకొని విచారించింది.

Encounter : ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మృతి

పాకిస్థాన్‌ నుంచి నిధులు అందాయా.. అక్కడి నుంచి ఎవరు ఫోన్‌ చేశారు అన్న విషయాలు రాబట్టే ప్రయత్నం చేసింది. నవీద్‌ తండ్రి నజీర్‌ అహ్మద్‌ను కూడా విచారించారు. నవీద్‌ బ్యాంక్‌ అకౌంట్‌ లావాదేవీలను తనిఖీ చేశారు. సుమారు నాలుగు గంటలకుపైగా విచారించిన ఎన్‌ఐఏ అధికారులు నవీద్‌ను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తిరిగి అవసరమైనప్పుడు విచారణకు రావాలని ఆదేశించారు.