KTR Tweet : థాంక్స్ పప్పు, కేటీఆర్ ట్వీట్ వైరల్

కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ..ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నయ్యా అంటూ పోస్టు చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందించారు.

10TV Telugu News

Thanks Pappu : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు రాష్ట్రమంతటా జరిగాయి. తన బర్త్ డే సందర్భంగా ఎవరూ హైదరాబాద్ రావొద్దని, తోచిన విధంగా ఎవరికి వారు ఇతరులకు సహాయం అందించాలని, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ ఇదివరకే విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఇతరులు మొక్కలు, ఆహారం పంపిణీ, ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టారు. ఇదిలా ఉంటే..సోషల్ మీడియాలో కేటీఆర్ కు బర్త్ డే విషెష్ వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రెటీలు కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.

అయితే..ఓ ట్వీట్ తెగ వైరల్ గా మారింది. కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ..ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నయ్యా అంటూ పోస్టు చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందించారు. థాంక్స్ పప్పు అంటూ ధన్యవాదాలు చెప్పారు. కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియచేశారు. ఆయురారోగ్యాల‌తో మ‌రింత‌కాలం ప్ర‌జా జీవితంలో కొన‌సాగాల‌ని హ‌రీష్ రావు ఆకాంక్షించారు. పలువురి ట్వీట్ కు మంత్రి కేటీఆర్ బదులిస్తున్నారు. మంత్రి హ‌రీష్ రావు ట్వీట్‌కు కేటీఆర్ బ‌దులిచ్చారు.. థాంక్స్ బావ అంటూ ట్వీట్ చేశారు.

10TV Telugu News