Drugs Case : డ్రగ్స్ కేసులో ఎక్సైజ్‌శాఖకు చుక్కలు చూపిస్తున్న నిందితులు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిందితులు ఎక్సైజ్‌ శాఖకు చుక్కలు చూపిస్తున్నారు. డ్రగ్స్ కేసులో 12 ఎక్సైజ్ శాఖ ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేసింది. కోర్టు విచారణకు నిందితులు డుమ్మా కొట్టారు.

Drugs Case : డ్రగ్స్ కేసులో ఎక్సైజ్‌శాఖకు చుక్కలు చూపిస్తున్న నిందితులు

Drugs (1)

Tollywood drugs case accused : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిందితులు ఎక్సైజ్‌ శాఖకు చుక్కలు చూపిస్తున్నారు. డ్రగ్స్ కేసులో 12 ఎక్సైజ్ శాఖ ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేసింది. అయితే కోర్టు విచారణకు స్వీకరించినా నిందితులు డుమ్మా కొట్టారు. 2019 నుంచి నిందితుడు సంతోష్ దీపక్ అదృశ్యం అయ్యాడు. 2020 నుంచి కెల్విన్ కోర్టుకు హాజరుకాలేదు. మూడుసార్లు నోటీసులిచ్చినా కెల్విన్ కోర్టుకు హాజరుకాలేదు. 2018 నుంచి అబూబకర్ కోర్టుకు రాలేదు. ముషీరాబాద్ ఎక్సైజ్ కేసులో సోహెల్ పరారీలో ఉన్నారు. మైక్ కమింగా విదేశాలకు పారిపోయాడు. నిందితులు హాజరుకాకపోవడంతో డ్రగ్స్ కేసు విచారణ ముందుకు సాగలేదు. నిందితులపై నాన్‌బెయిల్‌బుల్ వారెంట్లు జారీ అయినా పట్టుకోవడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది.

ఇటీవలే టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్‌లో సంచలన విషయాలను ప్రస్తావించింది. కెల్విన్‌పై ఛార్జ్ షీట్‌లో సినీ తారలను విచారించినట్లు ప్రస్తావించిన ఎక్సైజ్ శాఖ.. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది. సినీ తారల డ్రగ్స్ కేసులో బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. సినీ తారలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాహకులకు డ్రగ్స్ అమ్మిననట్లు కెల్విన్ వాంగ్మూలంలో చెప్పినట్లు ఎక్సైజ్ శాఖ చెప్పింది.

Tollywood Drugs Case : ముగిసిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ?

సిట్ బృందం పలువురికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించిందని, అన్ని రకాల సాక్ష్యాలను సిట్ బృందం పరిశీలించి, విశ్లేషించిందని, సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లభించలేదని చెప్పింది ఎక్సైజ్ శాఖ. సెలబ్రిటీలపై కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని, సెలబ్రిటీలపై కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవపట్టించేదిలా ఉందని చెప్పింది.

కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేమని, సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాంగ్మూలం సరిపోదని ఎక్సైజ్ శాఖ చెప్పింది. సెలబ్రిటీలు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్ కూడా లభించలేదని, పూరి జగన్నాథ్, తరుణ్ స్వచ్ఛందంగా బయో శాంపిల్స్ కూడా ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ చెప్పింది.

పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ తేల్చినట్లు చెప్పింది. దాదాపుగా అందరు సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ చెప్పింది. నిందితులు, సాక్షుల జాబితాలో సినీ తారల పేర్లు పొందుపరచని ఎక్సైజ్ శాఖ వారికి దాదాపుగా క్లీన్ చీట్ ఇచ్చేసింది.