Neeraj's wife Sanjana: నా భర్తను చంపిన నిందితులను ఉరితీయాలి |The accused who killed my husband should be hanged

Neeraj’s wife Sanjana: నా భర్తను చంపిన నిందితులను ఉరితీయాలి

నా భర్త నీరజ్ ఏం తప్పుచేశాడని మా కజిన్ బ్రదర్ చంపాడు, మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమా అంటూ మృతుడు నీరజ్ భార్య సంజన ప్రశ్నించింది. నీరజ్ హత్యకు కారణమైన నిందితులను వెంటనే ఉరితీయాలని ఆమె డిమాండ్ చేసింది. శనివారం...

Neeraj’s wife Sanjana: నా భర్తను చంపిన నిందితులను ఉరితీయాలి

Neeraj’s wife Sanjana: నా భర్త నీరజ్ ఏం తప్పుచేశాడని మా కజిన్ బ్రదర్ చంపాడు, మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమా అంటూ మృతుడు నీరజ్ భార్య సంజన ప్రశ్నించింది. నీరజ్ హత్యకు కారణమైన నిందితులను వెంటనే ఉరితీయాలని ఆమె డిమాండ్ చేసింది.  10టీవీ ప్రతినిధితో షాహీనాథ్ గంజ్ పరువు హత్యా కేసు బాధిత కుటుంబం నీరజ్ సతీమణి సంజన, తల్లి జగదీష్ పన్వార్ మాట్లాడారు. సంజన మాట్లాడుతూ.. నా భర్త నీరజ్ ఎం తప్పు చేశాడనీ మా కజిన్ బ్రదర్ నీరజ్ ను చంపారని ప్రశ్నించింది. మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమా..? నీరజ్ ను హత్యా చేసి కర్ణాటక గుడిమత్కల్ ప్రాంతానికి పరార్ అయిన నిందితులను ఉరి తీయాలని, అప్పుడే నా భర్త ఆత్మకు శాంతి చేకూరుతుందని తెలిపింది. ఇప్పుడు నా భర్తను హతమార్చారు, రేపు నా రెండు నెలల బాబును చంపుతారు. లేదంటే నా మామ అత్తలను ఎటాక్ చేస్తారు, మేము ఇలా ఎన్ని రోజులు భయపడుతూ బ్రతకాలి అంటూ సంజన ప్రశ్నించింది. నాకు న్యాయం జరగాలి. నా పేరెంట్స్ ,  కజిన్ బ్రదర్ లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.

Crime news: హైదరాబాద్ పరువు హత్య కేసులో పురోగతి..

నీరజ్ తల్లి జగదీష్ పన్వార్ మాట్లాడుతూ.. నేను నా మనవడు పోతుండగా వెంటాడి నీరజ్ ను హతమార్చారు. నా కళ్ళ ముందే అతికిరాతకంగా నీరజ్ ను హత్యచేశారు. మమ్మల్ని వెంబడించిన ఐదుగురు దుండగులు మా సమీపంలోకి రాగానే మా కళల్లో ఏదో చల్లారు. మాకు ఎం కనిపించలేదు. కొబ్బరి బొండాల కత్తితో మొదట దాడి చేశారు. ఆపై పక్కనే ఉన్న బండరాయితో తలపై వేశారు. నేను అడ్డుకునేందుకు ప్రయత్నించగా నాపై కూడా దాడి చేశారు. నా కొడుకుపై దాడిచేస్తుంటే ఆపేందుకు ఎవరు ముందుకు రాలేదు. నా కుమారుణ్ణి చంపిన వారికి శిక్ష పడే వరకు నేను పోరాడుత. ఏడాది క్రితం నా కొడుకు, కోడలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇలాంటి గొడవలు వస్తాయని మేము ముందే అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో నీరజ్ సంజన ఇద్దరు మాతోనే ఉంటున్నారు. అంతలోనే ఇలా జరుతుందని, నా కొడుకును కోల్పోతానని అనుకోలేదు. కొద్ది రోజులుగా నా కొడుకును వెంబడించి పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారంటూ నీరంజన్ తల్లి కన్నీరు పర్యాంతమైంది.

Crime News: 30 రూపాయల కోసం కిరాణా దుకాణదారుడిని హత్యచేశారు..

ఇదిలా ఉంటే నీరజ్ హత్యను ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని, వారి కుటుంబానికి న్యాయం చేయాలని బేగంబజార్, షాహినాథ్ గంజ్ వ్యాపారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం షాపులను బంద్ చేసి తమ నిరసనను తెలిపారు. మరోవైపు నీరజ్ హత్యకు కారణమైన ఐదుగురు నిదితులను పోలీసులు గుర్తించారు. కర్ణాటకలో వారిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు. మరోవైపు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

×