Procurement Of Grain : తెలంగాణ నుంచి ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణను పెంచిన కేంద్రం

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సమాచారం అందించింది. ఖరీఫ్ సీజన్ లో 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకుంటామని తెలిపింది.

Procurement Of Grain : తెలంగాణ నుంచి ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణను పెంచిన కేంద్రం

Grain 11zon

central government increased procurement of grain : తెలంగాణ నుంచి ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ నుంచి మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనున్నట్లు వెల్లడించింది. పెంచిన బియ్యం కోటాతో కలిపి ఖరీఫ్ సీజన్ లో 46 లక్షల మెట్రిక్ టన్నల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయనుంది. ఈ మేరకు మంగళవారం (డిసెంబర్ 28,2021) కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఖరీఫ్ సీజన్ లో 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకుంటామని తెలిపింది.

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై తెలంగాణ మంత్రుల బృందం కేంద్రంతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కేంద్ర ఆహార, ప్రజా పంపిణి వ్యవహారాల శాఖమంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రుల బృందం సమావేశం అయ్యారు. వరి ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ మంత్రుల బృందం గతంలో కూడా గోయల్ తో భేటీ అయింది. గత భేటీలో కేంద్రం వరిధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇచ్చింది. అయితే లిఖితపూర్వక హామీ మాత్రం ఇవ్వలేదు. బాయిల్డ్ రైస్ విషయంపై కూడా మంత్రులు, కేంద్ర మంత్రితో చర్చించారు.

Maoists : చత్తీస్‌గఢ్ లో ఐఈడీ బాంబు పేల్చిన మావోయిస్టులు.. ముగ్గురు కూలీలకు గాయాలు

ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ ఇప్పటికే టీఆర్ఎస్ ధర్నాలు నిర్వహించింది. అస్పష్ట విధానం అనుసరిస్తున్న కేంద్రంపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కూడా టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర నిరసన, ఆందోళన నిర్వహించారు.

లోక్‌సభ, రాజ్య సభల్లో స్పీకర్ పోడియం ముందు నినాదాలు చేస్తూ కేంద్రానికి నిరసన తెలియజేశారు. ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని పలుమార్లు వాయిదా తీర్మాణాలను కూడా ఇచ్చారు. తమ మాట వినట్లేదంటూ పార్లమెంటును కూడా టీఆర్ఎస్ బహిష్కరించిన సంగతి తెలిసిందే.

Telangana: మూసీ మురికికాలువ కాదు..కృష్ణా-మూసీ నదుల సంగమంలో వజ్రాల గనులు : సర్వేలో వెల్లడి

అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో విపక్షాలు సైతం కేంద్రంపై విమర్శలు చేశారు. రాష్ట్రం నుంచి ఖరీఫ్ లో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలును కేంద్రం పెంచింది. ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ నుంచి మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనున్నట్లు వెల్లడించింది.