Chennai NGT : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు బ్రేక్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరం తెలిపింది. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని ఆదేశించింది.

Chennai NGT : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు బ్రేక్

Palamuru

Palamuru-Rangareddy project : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అభ్యంతరం తెలిపింది. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ చెప్పింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అక్రమమని ఏపీ వాదించింది. ప్రాజెక్టు పనులు వెంటనే నిలిపివేయాలని ఏపీ రైతులు కోరారు. తాగు నీటి కోసం ప్రారంభించిన ప్రాజెక్టును సాగునీటి కోసం విస్తరించవద్దని రైతులు అన్నారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై చెన్నై ఎన్జీటీ స్టే విధించింది. కేంద్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వశాఖ నుండి పర్యావరణ అనుమతులు లేకుండా పనులను కొనసాగించకూడదని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ వాదనలు, అభ్యంతరాలను ఎన్జీటీ అంగీకరించింది. సరియైన సమయంలో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను ఎన్జీటీ దృష్టికి తీసుకురాలేదని తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాన్ని ఎన్జీటీ అంగీకరించలేదు. వచ్చే నెలాఖరున ఎన్జీటీ మళ్లీ విచారణ చేపట్టనుంది.

TTD Calenders : బ్లాక్ మార్కెట్ లో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు.. విచారణకు ఆదేశం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద నిర్మిస్తున్నారు. దీనికి 2015, జూన్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రణాళికగా ఉంది.

మరోవైపు హైదరాబాద్‌ సిటీకి తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అందించే లక్ష్యాలతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయితే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏపీ అభ్యంతరం తెలుపుతోంది. దీనిపై తన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం సహా అన్ని వేదికల దృష్టికి తీసుకెళ్లింది.

Huzurabad By-Election : రేపే హుజూరాబాద్ బైపోల్.. డిసైడర్లు మహిళా ఓటర్లే

దీనిపై విచారణ జరిపిన చెన్నై ఎన్జీటీ.. ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఆదేశించింది. కేంద్ర అటవీశాఖ అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీలో ఎదురుదెబ్బ తగలింది. ఏపీ పోరాటం ఫలించినట్లు అయ్యింది. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.