Crime news: పోలీసుల అత్యుత్సాహం.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది. పెండింగ్ చలానా కట్టాలని 45 నిమిషాలు కారును రోడ్డపైనే పోలీసులు నిలిపివేశారు. ఆస్పత్రికి వెళ్లాలని ఎంత వేడుకున్నా కనికరించక పోవటంతో కారులో ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న చిన్నారి...

Crime news: పోలీసుల అత్యుత్సాహం.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

Police

Crime news: జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది. పెండింగ్ చలానా కట్టాలని 45 నిమిషాలు కారును రోడ్డపైనే పోలీసులు నిలిపివేశారు. ఆస్పత్రికి వెళ్లాలని ఎంత వేడుకున్నా కనికరించక పోవటంతో కారులో ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న చిన్నారి పరిస్థితి మరింత విషమించి కన్నుమూశాడు. పోలీసుల తీరుకారణంగానే మా కుమారుడు మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు. కుమారుడు మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనలో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Crime news: పెళ్లి చేసుకోనన్న ప్రియురాలు.. లేఖరాసి ప్రియుడు ఆత్మహత్య.. ఆ లేఖలో ఏముందంటే..

జనగామ మండలం మరిగడికి చెందిన మచ్చమల్లేషం సరస్వతి దంపతుల మూడు నెలల బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాదు నీలోఫర్ ఆసుపత్రికి జనగామ వైద్యులు రిఫర్ చేశారు. దీంతో హుటాహుటీన బాబును హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోకి కారు ప్రవేశించింది. యాదాద్రికి సమీపంలోని వంగపల్లి వద్ద పోలీసులు కారును నిలిపారు. కారు డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగా కారును ఆపారు. ఈ కారుపై పెండింగ్ చలాన ఉంది. అయితే ఈ పెండింగ్ చలాన్ చెల్లిస్తేనే కారును వదిలేస్తామని కారును నిలిపివేశారని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సుమారు 45 నిమిషాల పాటు కారును ఆపారుని, చిన్నారికి చికిత్స అందించాలని, పరిస్థితి విషమంగా ఉందని వేడుకున్నా పోలీసులు కనికరించలేదని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆసుపత్రికి ఆలస్యంగా వెళ్లడం కారణంగా మా కుమారుడు మరణించినట్టు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Crime news: గ్యాస్ సిలీండర్ పేలి కూలిన ఇంటి పైకప్పు.. నలుగురు మృతి.. శిథిలాల కింద చిక్కుకొని..

కారులో ప్రాణాప్రాయ స్థితిలో నా కొడుకు ఉన్నాడు, వెంటనే వదలాలని వేడుకున్నా పోలీసులు కనికరించలేదని బాలుడి తల్లి వాపోయింది. చలానా చెల్లిస్తేనే వదిలేస్తామని అన్నారని, ఫలితంగా ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ఆసల్యం కావడంతో నా కొడుకు మృతిచెందాడని మృతుడి తల్లి వాపోయింది. ఈ విషయంపై పోలీసులు స్పందించారు.. తమ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో జనగామ జిల్లా నుండి వస్తున్న కారు డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోకపోతే తమ సిబ్బంది ఆపారని చెప్పారు. కారులో అనారోగ్యంతో ఉన్న బాలుడు ఉన్నాడని, ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పలేదని తెలిపారు.