TPCC: కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న పీసీసీ కమిటీల గొడవ.. రేవంత్‌కు వ్యతిరేకంగా సీనియర్ల సమావేశం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్గం వర్సెస్ సీనియర్ల వివాదం ముదురుతోంది. తాజాగా ఏర్పాటైన పీసీసీ కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కకపోవడంపై పలువురు సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.

TPCC: కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న పీసీసీ కమిటీల గొడవ.. రేవంత్‌కు వ్యతిరేకంగా సీనియర్ల సమావేశం

TPCC: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మరింత ముదురుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లు అన్నట్లుగా సాగుతోంది వ్యవహారం. ఇటీవలి పీసీసీ కమిటీల కూర్పు నేపథ్యంలో పార్టీలోని అంతర్గత విబేధాలు మరోసారి బయటపడ్డాయి. కొత్తగా ఏర్పాటైన పీసీసీ కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కకపోవడంపై సీనియర్లు రేవంత్‌పై ఆగ్రహంతో ఉన్నారు.

Gangster Goldy Brar: గోల్డీ బ్రార్ వ్యవహారం టాప్ సీక్రెట్.. అమెరికాతో చర్చిస్తున్నాం: పంజాబ్ సీఎం భగవంత్ మన్

దీంతో ఈ అంశంపై మల్లు భట్టివిక్రమార్క ఇంట్లో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు శనివారం భేటీ అయ్యారు. కొత్త కమిటీల్లో వలసవాదులకు పెద్దపీట వేయడంపై గుర్రుగా ఉన్నారు సీనియర్లు. 50 శాతానికిపైగా పదవులు టీడీపీ నుంచి వలస వచ్చిన వారికే ఇచ్చారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వారికి పదవులు ఇచ్చారని, ఈ నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారం కాబోతుందని అభిప్రాయపడుతున్నారు. ఇకపై నేతలంతా కలిసి ‘సేవ్ కాంగ్రెస్’ పేరిట పని చేయాలని నిర్ణయించారు. తక్షణమే సేవ్ కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ కోసమే పని చేస్తున్న నేతలకు కమిటీల్లో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు.

Mumbai: ముంబై పిజ్జా రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం… ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు

రేవంత్ నిర్వహించే కార్యక్రమాలు బాయ్‌కాట్ చేయాలని సీనియర్ నేతలు నిర్ణయించారు. పీసీసీ కమిటీల అంశం ఒక కొలిక్కి వచ్చే వరకు రేవంత్ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆదివారం హైదరాబాద్, గాంధీ భవన్‌లో నిర్వహించే పీఏసీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలకు సీనియర్లు దూరంగా ఉండనున్నారు. అయితే, ఈ సమావేశాల్ని తిరిగి కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నెల 20న మరోసారి భేటీ కావాలి అనుకుంటున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇంట్లో సమావేశం కావాలని నిర్ణయించారు.