Corona Vaccine : అపోలో ఆస్పత్రుల్లో పిల్లలకు కరోనా వ్యాక్సిన్..!

అపోలో ఆస్పత్రుల్లో త్వరలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. త్వరలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్స్ అందిస్తామని అపోలో గ్రూప్ ఛైర్మన్ డా.ప్రతాప్ సి రెడ్డి అన్నారు.

Corona Vaccine : అపోలో ఆస్పత్రుల్లో పిల్లలకు కరోనా వ్యాక్సిన్..!

Apollo

corona vaccine in Apollo hospitals : అపోలో ఆస్పత్రుల్లో త్వరలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. త్వరలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్స్ అందిస్తామని అపోలో గ్రూప్ ఛైర్మన్ డా.ప్రతాప్ సి రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం (అక్టోబర్ 25, 2021) ప్రకటన విడుదల చేశారు.

మొదటగా కోమార్పిడిటీస్ తో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని డా.ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. అయితే ఆమోదం రావాల్సిన ఉందని చెప్పారు. 2 నుంచి 8 ఏళ్ల వయసు గల వారికి కోవాగ్జిన్ వ్యాక్సిన్ సిద్ధమైందని ఆయన తెలిపారు. 28 రోజుల వ్యవధిలో రెండు మోతాదుల్లో ఇవ్వాలన్నారు.

Corona Vaccine : త్వరలోనే అందుబాటులోకి మరో టీకా

ఇంట్రా-మస్కులరీ విధానంలో వేస్తారని తెలిపారు. 12 నుంచి 18 ఏళ్ల వయసు కల్గిన వారికి జైకోవ్-డీ వ్యాక్సిన్ 28 రోజుల వ్యవధిలో 3 డోసులు ఇవ్వాలని సూచించారు. ఇది ఇంజెక్షన్ రహిత వ్యాక్సిన్ అని తెలిపారు. వ్యాక్సిన్ లతోనే పిల్లలకు పూర్తి రక్షణ ఉంటుందని వెల్లడించారు.