Drugs Case: కదులుతున్న డ్రగ్స్ డొంక.. కస్టడీలోకి టోనీ.. కెల్విన్‌తో సంబంధాలు

డ్రగ్స్ కేసులో డొంక కదులుతోంది. టోనీతో సంబంధాలు ఉన్నవారి గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు.

Drugs Case: కదులుతున్న డ్రగ్స్ డొంక.. కస్టడీలోకి టోనీ.. కెల్విన్‌తో సంబంధాలు

Drugs

Drugs Case: డ్రగ్స్ కేసులో డొంక కదులుతోంది. టోనీతో సంబంధాలు ఉన్నవారి గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు. గతంలో పట్టుబడ్డ కెల్విన్‌కి టోనీతో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

వ్యాపార, సినీ రంగానికి చెందిన పలువురికి కెల్విన్ డ్రగ్స్‌ సరఫరా చేసినట్లుగా గుర్తించారు. కెల్విన్‌కు చెందిన కస్టమర్లతో టోనీకి లింక్స్ ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో ధర్యాప్తు చేస్తున్నారు.

కెల్విన్‌ కస్టమర్లలో కొందరికి టోనీ డ్రగ్స్‌ సరఫరా చేసినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే టోనీని 5 రోజులు కస్టడీలోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. విచారణలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తల లింక్‌లను వెలికి తీయనున్నారు.

వ్యాపారవేత్తలు ఇచ్చిన పార్టీలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. టోనీ వద్ద డ్రగ్స్‌ తీసుకొని కొందరు వ్యాపారస్తులు పార్టీల్లో సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న వ్యాపారులు ఎక్కడ? అనే కోణంలో గాలిస్తున్నాయి పోలీస్ బృందాలు.

డ్రగ్స్‌ దందాపై ఇప్పటికే ఉక్కుపాదం మోపాలని ఆదేశించింది కేసీఆర్‌ సర్కార్. డ్రగ్స్‌ కట్టడి విషయంలో ఎంతటివారినైనా వదలొద్దని ఆదేశించారు సీఎం కేసీఆర్.

నేరస్తులను కాపాడేందుకు రాజకీయ నేతలు సిఫార్సు చేసినా ఒప్పుకునేదే లేదని అన్నారు. ఈ విషయంలో ఏ పార్టీకి చెందినవారినైనా వదలొద్దన్నారు కేసీఆర్‌.