50 శాతం బెడ్లు ప్రభుత్వానికిచ్చే విషయంపై చర్చలు పూర్తి కాలేదంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు

  • Published By: bheemraj ,Published On : August 14, 2020 / 06:37 PM IST
50 శాతం బెడ్లు ప్రభుత్వానికిచ్చే విషయంపై చర్చలు పూర్తి కాలేదంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు

ప్రైవేట్ ఆస్పత్రులతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. 50 శాతం బెడ్లు ప్రభుత్వానికి ఇచ్చే విషయంపై ఇంకా తమ చర్చలు పూర్తి కాలేదని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. మరోసారి భేటీ అయ్యాక స్పష్టత ఇస్తామని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. మరోసారి సమావేశం అయి చర్చించుకున్నాక ఏ సంగతి చెబుతామని తెలిపారు. దీంతో చర్చలు మధ్యలోనే ముగిసిపోయాయి.

కరోనా రోగుల కోసం 50 శాతం బెడ్లు స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం బెబుతోంది. ప్రైవేట్ ఆస్పత్రుల రోగులను దోచుకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి విధి విధానాలు కూడా ఇంకా ఖరారు కాలేదు.

కోవిడ్ చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయి. కరోనా బాధితులను పట్టిపీడిస్తున్నారు. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని అనేక ఆరోపణలు, ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. దాదాపు 1039 ఫిర్యాదులు ప్రభుత్వానికి అందినట్లుగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ఆస్పత్రుల్లో నియంత్రణ ఉండాలి..కట్టడి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నిన్న ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించారు. ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉన్న 50 శాతం బెడ్లను ప్రభుత్వం స్వాధీన పర్చుకుంటుందని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే కోవిడ్ చికిత్సలు నిర్వహించాలని చెప్పారు.

ఇవాళ మరోసారి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తో ప్రైవేట్ ఆస్పత్రుల మేనేజ్ మెంట్స్ అన్ని కూడా చర్చించాయి. దాదాపుగా గంట నుంచి రెండు గంటలపాటు చర్చించిన తర్వాత బయటికొచ్చిన ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఇంకా తమ చర్చలు కొనసాగుతున్నాయని, కొలిక్కి రాలేదన్నారు.

50 శాతం బెడ్ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రేపు మరోసారి చర్చలకు పిలుస్తామని చెప్పారు. తర్వాతే తాము పూర్తి వివరాలను ప్రకటిస్తామని చెప్పడం కొసమెరుపుగా కనిపిస్తోంది. ప్రైవేట్ యాజమాన్యాలతో ప్రభుత్వం నిన్న, ఇవాళ చర్చించి విధి విధానాలను ప్రకటిస్తామని ప్రభుత్వం చెబుతుంటే కానీ ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల వర్షన్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఇప్పటికూడా 50 శాతం బెడ్లపై ప్రైవేట్ యాజమాన్యాలు క్లారిటీ ఇవ్వలేదు.

మరోసారి చర్చకు కూర్చోవడానికి తాము సిద్ధమవుతున్నామని చెప్పి వెళ్లిపోయారు
ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కోవిడ్ చికిత్సలు అందించేందుకు ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతిచ్చిన తర్వాత జనరల్ పేషెంట్స్ కు ఒక రకమైన ఫీజులు వసూలు, ఆక్సిజన్ అవసరమున్న పేషెంట్ కు ఒకరకమైన ఫీజులు, ఐసీయూ బెడ్లు వినియోగిస్తూ వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ కు 9 వేల ఫీజు వసూలు చేయాలని చెప్పారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకే వసూలు చేయాలని చెబుతోంది. కానీ ఇవ్వన్నీ తమకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి కాదు.. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది మొత్తానికంతా డబ్బులు ఎప్పటికప్పుడు చెల్లించాలి, నెల జీతాలు ఇవ్వాలని చెబుతున్నారు.

మరోవైపు పీపీఈ కిట్లు మొదలుకొని ఎన్ 95 మాస్కులు నుంచి ప్రతి ఒక్కటి కూడా చార్జీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయో వీటన్నింటిని తాము ఫీజులు మినహాయించి ట్రీట్ మెంట్ చేస్తున్న ఫీజులు కాకుండా మిగతా ఖర్చులన్నింటిని ప్రభుత్వం లెక్కకట్టాల్సిన అవసరం లేదంటే కన్ ఫ్యూజన్ కొనసాగుతోంది.