ATM Theft : చెవులు వినపడవు, మాటలు రావు.. కానీ ఏటీఎంలో చోరీకి వెళ్ళాడు

అతనికి చెవుడు.. మాటలు కూడా రావు. కానీ దొంగతనం చేయాలనుకుని ఏటీఎం గదిలోకి దూరాడు.

ATM Theft : చెవులు వినపడవు, మాటలు రావు.. కానీ ఏటీఎంలో చోరీకి వెళ్ళాడు

Atm Theft

ATM Theft : అతనికి చెవుడు.. మాటలు కూడా రావు. కానీ దొంగతనం చేయాలనుకుని ఏటీఎం గదిలోకి దూరాడు. ఓ ఇనుపరాడ్డుతో ఏటీఎంను ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా అలారం మోగింది. అతడికి వినికిడి శక్తి లేకపోవడంతో అలారం మోగిన ఏం అర్ధం కాలేదు. అంతే చోరిపనిలో నిమిమగ్నమై పోయాడు. ఏటీఎం అలారం మోగడంతో స్థానికులు అలెర్ట్ అయి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

చదవండి : Theft : అనంతలో దొంగల బీభత్సం.. టీచర్‌ని హత్యచేసి దోపిడీ

పోలీసులు ఏటీఎం వద్దకు చేరుకునే వరకు కూడా సదరు వ్యక్తి చోరీకి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అప్పటికి ఏటీఎంను తెరిచే పనిలో బిజీబిజీగా ఉన్నాడు. కాగా ఈ ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నగరానికి చెందిన సునీల్ అనే వ్యక్తికి చెవులు వినపడవు, మాటలు రావు. ఇతడు పారిశ్యుద్య విభాగంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

చదవండి : Theft In Police Officers Apartement : పోలీసాఫీసర్లు ఉండే అపార్ట్‌మెంట్ లోనే చోరీ

సునీల్ శనివారం రాత్రి స్థానికంగా పద్మారావు నగర్ లోని ఎస్బీఐ ఏటీఎంలో దూరి చోరీకి యత్నించాడు. అలారం సౌండ్ వినిపించకపోవడంతో ఎవరు చూడటం లేదని ఏటీఎంను పగలగొట్టే పనిలో నిమగ్నమై పోయాడు. చివరకు పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకుంటే కానీ తెలియలేదు తాను దొంగతనం చేస్తున్న విషయాన్నీ స్థానికులు పసిగట్టారని. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.