Father Beat Son : అల్లరి చేస్తున్నాడని కొడుకును చితకబాదిన తండ్రి..పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి

హైదరాబాద్ పాతబస్తీ లో దారుణం జరిగింది. కన్నకొడుకుపై కసాయి తండ్రి అమానుషంగా ప్రవర్తించాడు. చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నకొడుకుపై కసాయి తండ్రి కర్రతో పాశవికంగా దాడి చేశాడు.

Father Beat Son : అల్లరి చేస్తున్నాడని కొడుకును చితకబాదిన తండ్రి..పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి

Beating

father severely beat son : హైదరాబాద్ పాతబస్తీ లో దారుణం జరిగింది. కన్నకొడుకుపై కసాయి తండ్రి అమానుషంగా ప్రవర్తించాడు. చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నకొడుకుపై కసాయి తండ్రి కర్రతో పాశవికంగా దాడి చేశాడు. తన కొడుకుకు బుద్ధి చెప్పుకున్నానని సాక్ష్యం చూపించేందుకు కూతురుతో వీడియో తీయించి అందరికి షేర్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అశోక్, జిజియ భాయి భార్యాభర్తలు. లాల్ దర్వాజ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి లడ్డు అనే బాలుడు(10) ఉన్నాడు. బాలుడు బాగా అల్లరి చేస్తున్నాడని ఇరుగు పొరుగువారు తండ్రి అశోక్ కి ఫిర్యాదు చేశారు. దీంతో మద్యం మత్తులో తండ్రి అశోక్.. కొడుకు లడ్డును కర్రతో గొడ్డును బాదినట్ల్లు బాదాడు. తప్పు అయ్యింది పప్పా క్షమించు అని కాళ్లావేళ్లా పడి వేడుకున్నా వినలేదు. కొడుకుపై కర్రతో అతి కిరాతకంగా దాడి చేసి గాయపరిచాడు. ఇంట్లో ఎవరు లేనీ సమయంలో కొడుకుపై తండ్రికి దాడికి పాల్పడ్డాడు. దెబ్బలకు బాలుడు విలవిలలాడాడు.

Illegal Affair : అమానుషం.. వివాహేతర సంబంధం నెపంతో స్తంభానికి కట్టేసి కొట్టారు

నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఛత్రినాక పీఎస్ పరిధిలో ఈ దారుణ సంఘటన జరిగింది. కొడుకుపై జరిగిన దాడిని తెలుసుకున్న బాలుడి తల్లి జిజా బాయి.. చత్రినాక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. జిజియ భాయి ఫిర్యాదు మేరకు అశోక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

ఛత్రినాక సీఐ అబ్దుల్ ఖాదర్ జిలాని
‘బాలుడు బాగా అల్లరి చేస్తున్నాడని ఇరుగు పొరుగు వారు తండ్రి అశోక్ కి ఫిర్యాదు చేశారు. దీంతో తండ్రి అశోక్ రెచ్చిపోయిన తండ్రి అశోక్.. కొడుకును కర్రతో గొడ్డును బాదినట్లు బాదాడు. తన కొడుకుకు బుద్ధి చెప్పుకున్నానని సాక్ష్యం చూపించేందుకు కూతురుతో వీడియో తీయించి అందరికి తండ్రి అశోక్ వీడియో షేర్ చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నాం’..అని పేర్కొన్నారు.