ఇంట్లో దీపం వెలిగించి కూలికి వెళ్లిన మహిళ..కాసేపటికే గ్యాస్ సిలిండర్ పేలి దగ్ధమైన ఇల్లు

హైదరాబాద్‌ లోని బంజారాహిల్స్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు కలకలం సృష్టించింది. ఒక్కసారిగా పెద్దశబ్ధం రావడంతో...అంబేద్కర్‌నగర్‌ వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.

ఇంట్లో దీపం వెలిగించి కూలికి వెళ్లిన మహిళ..కాసేపటికే గ్యాస్ సిలిండర్ పేలి దగ్ధమైన ఇల్లు

gas cylinder exploded : హైదరాబాద్‌ లోని బంజారాహిల్స్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు కలకలం సృష్టించింది. ఒక్కసారిగా పెద్దశబ్ధం రావడంతో…అంబేద్కర్‌నగర్‌ వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఇవాళ ఉందయం ఇంట్లో దీపం వెలిగించి ఇల్లాలు కూలికి వెళ్లింది. ఆమె వెళ్లిన కాసేపటికే గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.

సిలిండర్‌ పేలుడుతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించకుండా నీళ్లు చల్లారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైరింజన్లతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది నీళ్లు చల్లి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

ఈ ప్రమాదానికి కారణమేంటనేదానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీపం అంటుకుని సిలిండర్‌ పేలిందా? లేకపోతే..గ్యాస్ లీకయి పేలుడు సంభవించిందా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు.