Professor Hara Gopal: ఆదివాసీలతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి… తెలంగాణ పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హర గోపాల్ డిమాండ్

ఆదివాసులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్, బషీర్‌బాగ్‌లో గురువారం హరగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల ఆదివాసులపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు.

Professor Hara Gopal: ఆదివాసీలతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి… తెలంగాణ పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హర గోపాల్ డిమాండ్

Professor Hara Gopal: ఛత్తీస్‌గడ్-తెలంగాణ సరిహద్దులో ఆదివాసీలపై ప్రభుత్వం చేస్తున్న దాడులు నిలిపివేయాలన్నారు తెలంగాణ పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హర గోపాల్. ఆదివాసులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్, బషీర్‌బాగ్‌లో గురువారం హరగోపాల్ మీడియాతో మాట్లాడారు.

IND VS AUS: అరుదైన రికార్డులకు చేరువలో కోహ్లీ, అశ్విన్.. నాలుగో టెస్టులో సాధ్యమయ్యేనా?

ఈ సందర్భంగా ఇటీవల ఆదివాసులపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు. ‘‘ఛత్తీస్‌గడ్-తెలంగాణ సరిహద్దులో ఆదివాసులపై ప్రభుత్వం చేస్తున్న దాడులు నిలిపివేయాలి. ఆదివాసులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి. 2023 జనవరి 11న ఛత్తీస్‌గడ్ దక్షిణ బస్తర్, కిస్తారం, పామెడ్ ప్రాంతాల్లో జరిగిన బాంబు దాడులపై పౌరహక్కుల సంఘం నిజనిర్ధరణ జరిపింది. ఆదివాసుల సాధారణ హక్కులను ప్రభుత్వం హరిస్తోంది. వారిపై దాడి చేయాల్సిన అవసరం ఏముంది? ఆదివాసి గ్రామాలపై డ్రోన్ బాంబు దాడుల్ని ఖండిస్తున్నాం. ఆదివాసీలు కొత్తగా పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు.

India-Pak: పాక్ రెచ్చగొడితే భారత్ సైనిక చర్యకు దిగుతుంది.. అమెరికా వర్గాల అంచనా

మావోయిస్టులు ఆదివాసీలకు అండగా పోరాటాలు చేస్తారు. అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను దోచుకునేందుకే ప్రభుత్వం ఈ తరహా దాడులు జరుపుతోంది. ఛత్తీస్‌గడ్‌లో ఏర్పాటు చేసిన 100కుపైగా ఉన్న సెక్యూరిటీ క్యాంపులను వెంటనే ఎత్తివేయాలి. సిలింగేర్ సెక్యూరిటీ క్యాంపులకు వ్యతిరేకంగా ఆదివాసీలు ఆందోళన చేస్తున్నారు. ఆపరేషన్ సమాధాన్, ప్రహార్లను వెంటనే నిలిపివేయాలి. రాష్ట్రంలో ఫాసిజం పాలన నడుస్తోంది. ఆదివాసులకు అభివృద్ధి, మౌలిక సదుపాయాల్ని ప్రభుత్వం కల్పించాలి’’ అని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు.