Sarur Nagar Govt Jr.College : సరూర్ నగర్ కాలేజీలో 700 మంది విద్యార్థినులకు ఒక్కటే టాయిలెట్.. విద్యార్థి రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వసతులు లేకపోవడంపై ఎల్ ఎల్ బీ విద్యార్థి మనిదీప్ రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. కనీస వసతులైన తాగు నీరు, మరుగు దొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

Sarur Nagar Govt Jr.College : సరూర్ నగర్ కాలేజీలో 700 మంది విద్యార్థినులకు ఒక్కటే టాయిలెట్.. విద్యార్థి రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

Saroor Nagar

Sarur Nagar Govt Jr.College : రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వసతులు లేకపోవడంపై ఎల్ ఎల్ బీ విద్యార్థి మనిదీప్ రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. కనీస వసతులైన తాగు నీరు, మరుగు దొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఒకే మరుగు దొడ్డి ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత మూడు నెలలుగా అధికారులకు లేఖలు రాసినా పట్టించుకోకపోవడంతో 3 వందలకుపైగా సరూర్ నగర్ జూనియర్ కాలేజీ విద్యార్థులు తరగతలు బహిష్కరించారని తెలిపారు.

విద్యార్థి మణిదీప్ రాసిన లేఖ ఆధారంగా ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి
ఎన్.తుకారాంలతో కూడిన ధర్మాసనం సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. వసతుల లేమిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 700 మంది విద్యార్థినిలకు ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉండటంపై సీజేఐ ఉజ్జల్ భూయాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలను పర్యావరణానికి అనుకూలంగా తీర్చిదిద్దితే మరింత ఎక్కువ మంది బాలికలు చదువుకుంటారని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Caste Discrimination : ప్రభుత్వ స్కూల్‌లో కుల వివక్ష.. అగ్ని కుల క్షత్రియ, అగ్ర కుల విద్యార్థులకు వేర్వేరుగా పాఠశాలలు

ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్, ఇంటర్మీయట్ బోర్డు, సరూర్ నగర్ కాలేజీ ప్రిన్సిపల్ తోపాటు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థను ప్రతివాదిగా చేర్చుతూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సరూర్ నగర్ ప్రభుత్వ కాలేజీతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు, మరుగుదొడ్లలో సౌకర్యాలు మెరుగు పర్చేందుకు తీసుకుంటున్న చర్యలపై తగిన పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది.