High Court : జనం గుమిగూడకుండా నిషేధించండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

కరోనాపై దాఖలైన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచాలని, లేని పక్షంలో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని తెలిపింది.

High Court : జనం గుమిగూడకుండా నిషేధించండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

Telangana (1)

High Court directions to government : కరోనా కేసులు పెరుగుతుండటంతో.. జనం గుమికూడకుండా నిషేధం విధించాలని సర్కార్‌ను తెలంగణ హైకోర్టు ఆదేశించింది. రాజకీయ పార్టీలు, మతాలకు అతీతంగా నిషేధాజ్ఞలు ఉండాలని తేల్చిచెప్పింది. సినిమా హాల్‌, మాల్స్‌, ఇతర కమర్షియల్ కాంప్లెక్స్‌లో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించింది. పిల్లలకు కోవిడ్‌ చికిత్స అందించే ఆస్పత్రుల్లో సౌకర్యాలను మరింత మెరుగుపర్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కరోనాపై దాఖలైన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచాలని, లేని పక్షంలో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని తెలిపింది. సినిమాల హాల్స్, మాల్స్, సంతల్లో కరోనా మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది.

Telangana : జోనల్, మల్టీ జోనల్ కేడర్ కేటాయింపు పూర్తి

ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్ర సరిహద్దులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించింది. పిల్లల కోసం నిలోఫర్ తోపాటు మరో ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాలని వెల్లడించింది.