High Court : రోజుకు లక్ష కరోనా పరీక్షలు చేయాలి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఆర్‌టీ-పీసీఆర్‌, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

High Court : రోజుకు లక్ష కరోనా పరీక్షలు చేయాలి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

High Court

increase the RTPCR tests : RTPCR పరీక్షలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన హై కోర్టు.. రోజుకు లక్ష పరీక్షలు చేయాలని ఆదేశించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని అభిప్రాయపడింది. ఆర్‌టీ-పీసీఆర్‌, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

తెలంగాణలోని ఆస్పత్రుల్లో కరోనా కలకలం రేపుతోంది. గాంధీ, ఉస్మానియా లాంటి పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో వైద్యులు వైరస్ బారిన పడుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో 120 మంది డాక్టర్లకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఇక ఉస్మానియా ఆస్పత్రిలో ఏకంగా 159 మందికి వైరస్ సోకింది. ట్రీట్‌మెంట్ చేసే వైద్యులకే వైరస్ సోకడంతో టెన్షన్ మొదలైంది.

Dead Body : చెల్లి మృతదేహంతో అక్క.. నాలుగు రోజులుగా ఇంట్లోనే

తెలంగాణలో పోలీసులపై కూడా పంజా విసిరింది. హైద‌రాబాద్ పరిధిలోని రెండు పోలీస్ స్టేష‌న్లలో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. రాజేంద్రన‌గ‌ర్‌, జీడిమెట్ల పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలో 30 మంది సిబ్బందికి కొవిడ్‌ సోకింది. రాజేంద్రన‌గ‌ర్ పీఎస్ ప‌రిధిలో ఎస్సై, ఏఎస్సైతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.

రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఏ పరిస్థితులపైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐదు కోట్ల డోసుల టీకాలు వేశామని, అర్హులైన వారందరికీ టీకాలు ఇస్తున్నామన్నారు. ప్రజలు నిబంధనలు పాటిస్తే కరోనాను నియంత్రించవచ్చన్నారు హరీశ్‌రావు. అయితే రాష్ట్రంలో తక్షణమే నైట్‌ కర్ఫ్యూ అవసరం లేదని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయించింది.