Rains : తెలంగాణలో ఈనెల 21 వరకు వర్షాలు

తూర్పు, మధ్య బంగాళఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుప‌వ‌నాలు రెండు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉందన్నారు.

Rains : తెలంగాణలో ఈనెల 21 వరకు వర్షాలు

Rian

rains in Telangana : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈనెల 21 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతవరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

తూర్పు, మధ్య బంగాళఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుప‌వ‌నాలు రెండు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉందన్నారు. దీంతో ఇవాళ ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Andhra Pradesh Heavy Rains : మండుటెండల నుంచి బిగ్ రిలీఫ్.. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు

వాతావరణంలో వస్తున్న మార్పులతో పాటు నైరుతి రుతుపవనాల ఆగమనం మొదలు కావడంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి ఉపశమనం కలిగించింది. 20 జిల్లాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు, 5 జిల్లాల్లో 39 పైన, మరో 5 జిల్లాల్లో 38పైన, 3 జిల్లాల్లో 37 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అత్యంత ఎక్కువగా కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో 42.8, కొత్తగట్టులో 42.7, ఆదిలాబాద్‌ జిల్లా భోరజ్‌లో 42.6, ఆదిలాబాద్‌ 42.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా మెదక్‌ జిల్లా కల్లకల్‌లో 23.8 డిగ్రీలు నమోదైంది.