8th Nizam Mukarram Jha : నేడు 8వ నిజాం ముకర్రం ఝా అంత్యక్రియలు.. మక్కా మసీదులో అధికార లాంఛనాలతో..

నేడు ఎనిమిదో నిజాం ముకర్రం ఝా అంత్యక్రియలు జరుగనున్నాయి. హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులోని అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.

8th Nizam Mukarram Jha : నేడు 8వ నిజాం ముకర్రం ఝా అంత్యక్రియలు.. మక్కా మసీదులో అధికార లాంఛనాలతో..

NIZAM

8th Nizam Mukarram Jha : నేడు హైదరాబాద్ లో ఎనిమిదో నిజాం ముకర్రం ఝా అంత్యక్రియలు జరుగనున్నాయి. చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులో అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం వరకు సాధారణ ప్రజలు ముకర్రం ఝా పార్థీవ దేహానికి నివాళులర్పించేందుకు అనుమతించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు చౌమహల్లా మహల్ నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం మక్కా మసీదులో అంతిమ సంస్కరాలు నిర్వహించనున్నారు.

నిన్న ముకర్రం ఝా పార్థీవ దేహాన్ని టర్కీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తీసుకొచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా చౌమహల్లా ప్యాలెస్ కు తరలించారు. రాత్రి 7.45 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య కుటుంబ సభ్యులు, నిజాం కుటుంబానికి చెందిన వ్యక్తులు, నిజాం ట్రస్టులు ట్రస్టీలకు నివాళులర్పించేందుకు అనుమతిస్తారు. సీఎం కేసీఆర్ ముకర్రం ఝా భౌతికకాయం వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ముకర్రం ఝా కుటుంబ సభ్యులను పరామర్శించారు.

CM KCR Pays Tributes To Nizam : చివరి నిజాంకు ఘనంగా నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్ 8వ నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జా బహదూర్ (89) టర్కీలో కన్నుమూశారు. ఈ మేరకు ఆయన ఆఫీసు ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. 1933లో జన్మించిన మిర్ బర్కత్ అలీ ఖాన్.. కుటుంబంతో సహా టర్కీలో నివాసం ఉంటున్నారు. ఇస్తాంబుల్‌ లో ఆయన మొన్న రాత్రి 10.30 గంటలకు కన్నుమూశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు మిర్ బర్కత్ అలీ ఖాన్ మనవడు.

ముకర్రం జా అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంపై వీహెచ్ పీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రజలను, మహిళలను అవమానించి, ఇబ్బందులకు గురిచేసిన ఆయన అంత్యక్రియలను అధికారికంతా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై నిజాం కుబుంబ సభ్యులు, నిజాం ట్రస్టుల సభ్యులు స్పందించలేదు. పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.