Chicken Price : కొండెక్కిన కోడి..కేజీ చికెన్ ధర ఎంతో తెలుసా!

ఇక బోన్ లెస్ చికెన్ ధ‌ర మ‌ట‌న్ రేటుతో స‌మానంగా ఉంది. కిలో బోన్ లెస్ చికెన్‌ను సుమారు రూ.600ల‌కు విక్రయిస్తున్నారు.

Chicken Price : కొండెక్కిన కోడి..కేజీ చికెన్ ధర ఎంతో తెలుసా!

Chicken

chicken price : మాంసాహారం ధరలు మండిపోతున్నాయి. మటన్, చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్ప‌టికే మ‌ట‌న్ ధర పెరుగగా, మ‌రోవైపు చికెన్ ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. మ‌ట‌న్, చికెన్ ధరలు భారీగా పెరగడంతో కొన‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. మాంసం ధ‌ర‌లు అమాంతం పెరిగిపోవ‌డంతో మాంసాహార ప్రియుల నోటికి తాళం వేసిన‌ట్లు అయింది. ప్ర‌స్తుతం కిలో స్కిన్‌లెస్‌ చికెన్ ధ‌ర రూ.300గా ఉంది.

ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు పెళ్లిళ్లు కూడా ఓ కార‌ణ‌మ‌ని పౌల్ట్రీల య‌జ‌మానులు అంటున్నారు. ఇక బోన్ లెస్ చికెన్ ధ‌ర మ‌ట‌న్ రేటుతో స‌మానంగా ఉంది. కిలో బోన్ లెస్ చికెన్‌ను సుమారు రూ.600ల‌కు విక్రయిస్తున్నారు. ఐదు నెల‌ల క్రితం కిలో చికెన్ ధ‌ర రూ.80గా ఉన్నది. ఇప్పుడు రూ.300లకు పెరిగింది. అలాగే నాటు కోడి ధరలు కూడా పెరిగిపోయాయి. కిలో నాటు కోడి ధర రూ. 480గా ప‌లుకుతోంది.

Chicken Price: వేసవి ఎఫెక్ట్.. మాంసాహార ప్రియులకు షాక్..

వేసవి ఎండలు విపరీతంగా ఉండటం, వేడి గాలులు వీస్తుండటంతో ఫారాల్లో కోళ్లు చనిపోతున్నాయి. ఫలితంగా కిలో చికెన్ ధర రూ. 300కు చేరింది. గడిచిన వారం రోజుల్లోనే కిలో చికెన్ ధర రూ. 50 నుంచి 60 వరకు పెరిగింది. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే చికెన్ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు వేసవిలో శుభకార్యాలు, దేవుళ్లకు మొక్కలు, ఇతర కార్యక్రమాలు అధికంగా జరుగుతుంటాయి. దీంతో చికెన్ వినియోగం కూడా వేసవిలో ఎక్కువగా ఉండటం సర్వసాధారణం.

మరోవైపు మటన్ ధరలు కూడా మండిపోతున్నాయి. 10 రోజుల క్రితం కిలో మటన్ రూ. 750 వరకు ఉండేది. ప్రస్తుతం కిలో మటన్ ధర రూ. 800 నుంచి రూ. 850 వరకు పలుకుతుంది. దాదాపు మటన్ కిలో వెయ్యి ఉండటంతో ప్రజలు మటన్ కొనుగోలుకు ఆసక్తిచూపరు. ఎక్కువగా చికెన్ కొనేందుకే ఇష్టపడతారు. దీంతో చికెన్ ధరలు కూడా పెరగడంతో మాంసాహార ప్రియులకు నోరు కట్టేసినట్లైంది. పప్పు, ఆకు కూరలతో సరిపెట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఎండల తీవ్రత మరో నెలరోజుల పాటు ఇలానే కొనసాగే అవకాశం ఉండటంతో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు.