Abdullapurmet Case : అబ్దుల్లాపూర్ మెట్ కేసు నిందితుడి కస్టడీపై తీర్పు వాయిదా

అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు నిందితుడు హరిహర కృష్ణ కస్టడీపై తీర్పును రంగారెడ్డి జిల్లా కోర్టు రేపటికి వాయిదా వేసింది. నిందితుడు హరిహర కృష్ణను ఎనిమిది రోజులు కస్టడీకి ఇవ్వాలన్న విషయంపైన రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో వాదనలు ముగిశాయి.

Abdullapurmet Case : అబ్దుల్లాపూర్ మెట్ కేసు నిందితుడి కస్టడీపై తీర్పు వాయిదా

Abdullahpurmet case

Abdullapurmet Case : అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు నిందితుడు హరిహర కృష్ణ కస్టడీపై తీర్పును రంగారెడ్డి జిల్లా కోర్టు రేపటికి వాయిదా వేసింది. నిందితుడు హరిహర కృష్ణను ఎనిమిది రోజులు కస్టడీకి ఇవ్వాలన్న విషయంపైన రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో వాదనలు ముగిశాయి. రేపు హరిహర కృష్ణ కస్టడీపై కోర్టు తీర్పు ఇవ్వనుంది. హరిహర కృష్ణ తన ఫోన్ డేటాను డిలీట్ చేశాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితుడు కేసు నుంచి తప్పించుకోవాలని చూశాడని అన్నారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయడంతోపాటు కీలక ఆధారాలు సేకరించాల్సివుందని కోర్టులో పోలీసులు వాదనలు వినిపించారు.

అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని స్నేహితుడు నవీన్ ను హరిహరకృష్ణ చంపేశాడు. 3 నెలల క్రితమే నవీన్ మర్డర్ కు స్కెచ్ వేశాడు. 2 నెలల క్రితం మలక్ పేట సూపర్ మార్కెట్ లో కత్తి కొన్నాడు. ఈ నెల 17న పక్కా ప్లాన్ ప్రకారం నవీన్ ను మర్డర్ చేశాడు హరిహరకృష్ణ. హత్యకు ముందు పెద్ద అంబర్ పేట్ వైన్స్ లో నవీన్, హరి మద్యం తాగారు. యువతి విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఓఆర్ఆర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గొంతు నులిమి నవీన్ ను హత్య చేశాడు హరి. తర్వాత కత్తితో నవీన్ శరీర భాగాలు వేరు చేశాడు.

Abdullapurmet Incident : నవీన్ కేసు విచారణలో షాకింగ్ విషయాలు.. హత్య ఎలా చేయాలో యూట్యూబ్ లో సెర్చ్ చేసిన హరిహర కృష్ణ

శరీర భాగాలను బ్రాహ్మణపల్లి పరిధిలో పడేశాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న హసన్ అనే ఫ్రెండ్ ఇంటికి హరి వెళ్లాడు. అక్కడ స్నానం చేశాక హత్య విషయాన్ని హరి హసన్ కు చెప్పాడు. మరుసటి రోజు నవీన్ మర్డర్ విషయాన్ని ప్రియురాలికి కూడా నిందితుడు చెప్పాడు. ఆ తర్వాత వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖలో తిరిగాడు. ఫిబ్రవరి 24న తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నాడు. హత్య చేసిన స్పాట్ కి వెళ్లాడు. పారేసిన శరీర విడి భాగాలను సేకరించాడు. వాటన్నింటిని తగలబెట్టాడు. అదే రోజు సాయంత్రం పోలీసులకు నిందితుడు హరిహరకృష్ణ లొంగిపోయాడు.

నవీన్, హరి ఇద్దరూ స్నేహితులు ఒకే కాలేజీలో చదువుతున్నారు. అయితే, ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. అదే ఇంతటి దారుణానికి దారితీసింది. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. నవీన్ కారణంగా ప్రేమించిన అమ్మాయి తనకు ఎక్కడ దూరమవుతుందోనని హరి భయపడ్డాడు. నవీన్ ను లేపేసి ప్రియురాలిని దక్కించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం స్కెచ్ వేశాడు.

Abdullapurmet Incident : నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. పోలీసులే విస్తుపోయే నిజాలు

పార్టీ పేరుతో నవీన్ ను పిలిపించి మర్డర్ చేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను వేరు చేసి సైకోలా ప్రవర్తించాడు. నవీన్ వేళ్లు, పెదాలు, మర్మాంగాలు కోసి వాటి ఫొటోలు తన ప్రియురాలికి పంపాడు. అంతేకాకుండా గుండెను బయటకు తీశాడు. తలను కూడా వేరు చేశాడు. హరిహరకృష్ణ అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ఈ హత్యోదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.