ఫార్మసీ విద్యార్థిని ఘటనలో విస్తుపోయే వాస్తవాలు..పక్కా ప్లాన్ తోనే యువతి కిడ్నాప్, సామూహిక అత్యాచారం

ఫార్మసీ విద్యార్థిని ఘటనలో విస్తుపోయే వాస్తవాలు..పక్కా ప్లాన్ తోనే యువతి కిడ్నాప్, సామూహిక అత్యాచారం

Undressing will trigger rain of Rs 50 crore in cash

pharmacy student rape case : పోలీసులు సకాలంలో స్పందించకపోతే….ఘట్‌కేసర్ బాధిత యువతి…మరో దిశ అయ్యేదా….? యువతి కిడ్నాప్, అత్యాచారం ప్రణాళిక ప్రకారమే జరిగిందా..? పోలీస్‌ సైరన్‌లే బాధితురాలి ప్రాణాలు కాపాడాయా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఘట్‌కేసర్‌ దారుణంలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి నిందితులు యువతిని కిడ్నాప్ చేశారు.

నాగారంలోని రాంపల్లి చౌరస్తా దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. విద్యార్ధిని కిడ్నాప్ చేసిన అనంతరం అత్యాచారానికి పాల్పడ్డామని నిందితులు అంగీకరించారు. అత్యాచారం తర్వాత హత్య చేయాలని భావించారు. అయితే యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలించారు. ఆ క్రమంలో ఆగకుండా మోగుతున్న పోలీస్‌ సైరన్‌లు విన్న నిందితులు భయంతో…యువతిని చెట్ల పొదల్లో వదిలి పరారయ్యారు.

ఈ కేసు ఒక్కటే కాదు…నిందితులకు గతంలోనూ నేర చరిత్ర ఉంది. గతంలో కూడా కొందరు మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. వారిపై కిడ్నాప్, రేప్, బెదిరింపుల కేసు నమోదు చేశారు. నిందితుల కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. వారిని ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఇందులో నలుగురు ఆటో డ్రైవర్ల హస్తం ఉన్నట్లు గుర్తించడంతో.. ఆ నలుగురిని భువనగిరిలోని ఎస్‌వోటీ పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. యానంపేట్‌కు చెందిన రాజు, శివ, రమేష్, భాస్కర్‌ అనే ఆటో డ్రైవర్లు ఈ ఘోరం చేసినట్లు తెలుస్తోంది.

అమ్మాయి కిడ్నాప్ కోసం నిందితులు వారం రోజులుగా రెక్కీ నిర్వహించారని పోలీసుల విచారణలో వెల్లడైంది. నలుగురు నిందితుల్లో ఒక వ్యక్తి ముందుగా యువతితో సాన్నిహిత్యం ఏర్పాటు చేసుకున్నాడని గుర్తించారు. ఘటన జరిగిన రోజు మరో ముగ్గురు ఆటో డ్రైవర్లు మధ్యలో ఆటో ఎక్కినట్లు విచారణలో తేలింది. నాగారం సర్కిల్‌ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆటోను గుర్తించగా.. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

అత్యాచారం చేయాలనే ముందస్తు వ్యూహంతోనే బాధితురాలిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బాధితురాలిపై దాడి చేసేందుకు ముందుగానే రాడ్లు, కర్రలను నిందితులు సిద్ధం చేసుకున్నారు. కిడ్నాప్ చేయగానే బాధితురాలిపై దాడికి పాల్పడ్డారు. నిందితులు ఇటువంటి నేరాలు గతంలో చేసినట్టు సమాచారం.