Telangana budget 2021-22 : తెలంగాణ బడ్జెట్ రూ.2,30,825 కోట్లు

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ.హరీష్ రావు రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టారు. రూ.2,30,825 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపట్టారు.

Telangana budget 2021-22 : తెలంగాణ బడ్జెట్ రూ.2,30,825 కోట్లు

Telangana Budget

Telangana budget 2021-22 : తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ.హరీష్ రావు రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టారు. రూ.2,30,825 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపట్టారు. గత ఏడాది కన్నా 20 శాతం అధికంగా ఈసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మంచి వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. తెలంగాణ జీఎస్డీపీ రూ.9,78,373 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా బడ్జెట్ ఉంటుందని చెప్పారు. రేపటి అవసరాలకు తగ్గట్టు కేసీఆర్ నేడే ఆలోచించగలరని పేర్కొన్నారు. అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కామని చెప్పారు. కరోనా రూపంలో ఊహించని విపత్తు ఎదురైంది. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయన్నారు.

కరోనా పర్యవసనాలను తెలంగాణ అనుభవించిందన్నారు. ఆర్థిక వ్యవస్థలు తీవ్రస్థాయిలో ప్రభావితమయ్యాయని తెలిపారు. జీడీపీ ఎన్నడూలేని రీతిలో తగ్గిందన్నారు. దేశ జీడీపీతో పోల్చితే తెలంగాణ జీడీపీ ఎక్కువగా ఉందని చెప్పారు. కరోనా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నామని తెలిపారు. వ్యాక్సిన్ రాకతో సమాజం కోలుకుంటోందన్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో మంచి వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా తెలంగాణ జీఎస్ డీపీ వృద్ధి రేటు తగ్గిందన్నారు. 2021-22…రూ.1,27,728 ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం అధికమన్నారు. పల్లె ప్రగతి తెలంగాణ గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చివేసిందన్నారు. పల్లెలు పరిశుభ్రంగా మారిపోయాయని తెలిపారు.

తెలంగాణ బడ్జెట్ రూ.2,30,825 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు
క్యాపిటల్ వ్యయం రూ.29,046.77 కోట్లు
రెవన్యూ మిగులు రూ.6,743.50 కోట్లు
ఆర్థిక లోటు రూ.45,509.60 కోట్లు
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గాల అభివృద్ధికి రూ.800 కోట్లు
రైతు రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు
వ్యవసాయం కోసం రూ.25 వేల కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ.29,271 కోట్లు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైతు బీమా రూ.1200 కోట్లకు పెంచాలని నిర్ణయం
పశుసంవర్థక, మత్స్యశాఖకు రూ.1,730 కోట్లు
సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు
రైతు బంధు రూ.14,800 కోట్లు
రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ కోసం రూ.750కోట్లు
సమగ్ర భూ సర్వే కోసం రూ.400 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ.11,728 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.2,363 కోట్లు
పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 98.8 శాతం
పెన్షన్ల కోసం కేంద్రం ఇస్తోంది 1.2శాతం మాత్రమే
కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ రూ.2,750 కోట్లు
నూతన సచివాలయ నిర్మాణానికి రూ.610 కోట్లు
ఆర్టీసీకి బడ్జెట్ లో రూ.1,500 కోట్లు కేటాయింపు
బడ్జెటేతర నిధుల నుంచి ఆర్టీసీకి మరో రూ.1,500 కోట్లు
ఎస్సీల ప్రత్యేక ప్రగతినిధికి రూ.21,306.85 కోట్లు
ఎస్టీల ప్రత్యేక ప్రగతినిధికి రూ.12,304.23 కోట్లు
హైదరాబాద్ లో ఉచిత మంచినీటి సరఫరా కోసం రూ.250 కోట్లు
నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ కు నీటి తరలింపుకు కొత్త ప్రాజెక్టు
నాగార్జున సాగర్ సమీపంలో సుంకిశాల దగ్గర ప్రాజెక్టు నిర్మాణం
సుంకిశాల ప్రాజెక్టు కోసం రూ.725 కోట్లు కేటాయింపు
మూసీనది పునురుజ్జీవం కోసం రూ.200 కోట్లు
మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ.1000 కోట్లు
ఔటర్ రింగ్ రోడ్ లోపలి కాలనీలకు నీటి పరఫరా కోసం రూ.250 కోట్లు
వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం రూ.250 కోట్లు
ఖమ్మం కార్పొరేషన్ కు రూ.150 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.15,030 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ.1,606 కోట్లు
ఐటీ శాఖకు రూ.360 కోట్లు
వైద్య ఆరోగ్యశాఖకు రూ.6,295 కోట్లు
డబుల్ బెడ్ రూం ళ్ల కోసం 11 వేల కోట్లు
ఇప్పటివరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 52,456 ఇళ్ల నిర్మాణం
పట్టణాల్లో వైకుంఠధామా నిర్మాణానికి రూ.200 కోట్లు
విద్యారంగ ఉన్నతీకరణకు రూ.4 వేల కోట్లతో సరికొత్త పథకం
రానున్న రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల నిర్మాణం
బృహత్తర విద్యా పథకం కోసం రూ.2000 కోట్లు
పాఠశాల విద్య కోసం రూ.11,735 కోట్లు
ఉన్నత విద్యకు రూ.1,873 కోట్లు
విద్యుత్ రంగానికి రూ.11,046 కోట్లు
బతుకమ్మ చీరల కోసం రూ.338 కోట్లు
గొర్రెల పంపిణీకి రూ.3,000 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.1,702 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ.1,606 కోట్లు
దళిత జ్యోతి పథకం కోసం రూ.1,000 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.3,077 కోట్లు
అటవీశాఖకు రూ.1,276 కోట్లు
దేవాదాయ శాఖ అభివృద్ధికి 720 కోట్లు
ఈ ఏడాది నుంచి జంట నగరాల్లో ధూపదీప నైవేద్య పథకం
రోడ్లు, భవనాల శాఖకు రూ.8,788 కోట్లు
చేనేత సంక్షేమం కోసం రూ.338 కోట్లు
హోంశాఖకు రూ.6,465 కోట్లు
పర్యాటక-సాంస్కృతిక రంగానికి రూ.726 కోట్లు
గీత కార్మికుల సంక్షేమానికి రూ.25 కోట్లు
ఎస్టీ గృహాలకు విద్యుత్ రాయితీకి రూ.18 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1,500 కోట్లు
మిషన్ భగీరథకు రూ.16,931 కోట్లు
అన్ని పోలీస్ స్టేషన్లలో షీ టాయి్ లెట్ లు
షీ టాయ్ లెట్ ల కోసం రూ.20 కోట్లు