Supreme Court Key Judgment : ఉదాసీన్‌ మఠం వర్సెస్‌ ఐడీఎల్‌ కెమికల్స్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఉదాసీన్‌ మఠం వర్సెస్‌ ఐడీఎల్‌ కెమికల్స్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. భూములపై పూర్తి హక్కు ఉదాసీన్‌ మఠందేనని స్పష్టం చేసింది. కొన్నాళ్లుగా గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఐడీఎల్ కెమికల్స్ మధ్య యాజమాన్య హక్కుల కోసం పోరాటం జరుగుతోంది. లీజ్ తీసుకున్నా ఐడీఎల్ కెమికల్.. భూములపై యాజమాన్య హక్కుల కోసం ప్రయత్నించింది.

Supreme Court Key Judgment : ఉదాసీన్‌ మఠం వర్సెస్‌ ఐడీఎల్‌ కెమికల్స్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court key judgment

Supreme Court Key Judgment : ఉదాసీన్‌ మఠం వర్సెస్‌ ఐడీఎల్‌ కెమికల్స్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. భూములపై పూర్తి హక్కు ఉదాసీన్‌ మఠందేనని స్పష్టం చేసింది. కొన్నాళ్లుగా గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఐడీఎల్ కెమికల్స్ మధ్య యాజమాన్య హక్కుల కోసం పోరాటం జరుగుతోంది. లీజ్ తీసుకున్నా ఐడీఎల్ కెమికల్.. భూములపై యాజమాన్య హక్కుల కోసం ప్రయత్నించింది. అయితే.. ఐడీఎల్‌కు వ్యతిరేకంగా ఉదాసీన్ మఠం న్యాయపోరాటం చేసింది. వాదోపవాదనలు.. సుదీర్ఘ విచారణ అనంతరం.. భూములపై పూర్తి హక్కు ఉదాసీన్‌ మఠందేనని సుప్రీంకోర్టు తేల్చింది.

హైద‌రాబాద్ కూక‌ట్ ప‌ల్లి వై జంక్షన్ వ‌ద్ద ఉన్న అత్యంత విలువైన 540.30 ఎక‌రాల స్థలంపై పూర్తి హ‌క్కులు దేవాదాయ శాఖ ప‌రిధిలో ఉన్న ఉదాసిన్ మ‌ఠారివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉదాసిన్ మ‌ఠం వ‌ర్సెస్ గ‌ల్ఫ్ ఆయిల్ కార్పోరేష‌న్ (ఐడీయ‌ల్ కెమిక‌ల్స్) కేసులో మంగ‌ళ‌వారం (సెప్టెంబ‌ర్ 13) తీర్పు వెల్లడించింది. ఈ కేసు పూర్వాప‌రాల‌ను ప‌రిశీలిస్తే.. కూక‌ట్ ప‌ల్లి వై జంక్షన్ వ‌ద్ద ఉన్న ఉదాసిన్ మ‌ఠం భూముల‌ను 1964, 1966,1969, 1978లో నాలుగు ద‌ఫాలుగా బ‌ఫ‌ర్ జోన్ ఉన్న గ‌ల్ఫ్ ఆయిల్ కార్పోరేష‌న్‌కు 99 సంవ‌త్సరాల కాల వ్యవ‌ధికి లీజుకిచ్చింది.

Amaravati Assigned Land Scam : అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్ కేసులో కీలక పరిణామం

అయితే బ‌ఫ‌ర్ జోన్‌లో ఉన్న ఈ భూముల్లో గ‌ల్ఫ్ ఆయిల్ కార్పోరేష‌న్ 538 ఎక‌రాల విస్తీర్ణంలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించింది. దీన్ని స‌వాలు చేస్తూ ఉదాసిన్ మ‌ఠం దేవాదాయ శాఖ ట్రిబ్యున‌ల్‌ను ఆశ్రయించింది. ఈ పిటిష‌న్ విచారించిన ట్రిబ్యున‌ల్ 2011 సంవ‌త్సరంలో గ‌ల్ఫ్ ఆయిల్ కార్పోరేష‌న్‌కు ఇచ్చిన లీజును ర‌ద్దు చేసింది. ట్రిబ్యున‌ల్ తీర్పును స‌వాలు చేస్తూ గ‌ల్ఫ్ ఆయిల్ కార్పోరేష‌న్ హైకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. 2013లో ఆ పిటిష‌న్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది.

దీన్ని స‌వాలు చేస్తూ గ‌ల్ఫ్ ఆయిల్ కార్పోరేష‌న్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా 2013లో స్టేట‌స్‌కో మెయింటెయిన్ చేయాల‌ని అత్యున్నత న్యాయ‌స్థానం ఆదేశించింది. మంగ‌ళ‌వారం పిటిష‌న్ విచార‌ణ‌కు రాగా.. గ‌ల్ఫ్ ఆయిల్ కార్పోరేష‌న్ దాఖలు చేసిన పిటిష్‌న్‌ను డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప‌ట్ల తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి హ‌ర్షం వ్యక్తం చేశారు. న్యాయపోరాటం చేసిన ఉదాసీన్ మఠం సిబ్బంది, న్యాయవాదులను అభినందించారు.