Telangana Cabinet : తెలంగాణలో ఫారెస్ట్, మహిళా యూనివర్సిటీలకు కేబినెట్ ఆమోదం

రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తదుపరి భేటీకి పూర్తి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

Telangana Cabinet : తెలంగాణలో ఫారెస్ట్, మహిళా యూనివర్సిటీలకు కేబినెట్ ఆమోదం

Kcr

Forest and the Women’s Universities : తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చిస్తోంది. తెలంగాణలో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తదుపరి భేటీకి పూర్తి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ములుగులోని ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో విద్యనభ్యసించిన అర్హులైన విద్యార్థులకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్‌ కోటా కింద పలు విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది.

వచ్చే ఏడాది నుంచి నూతన విద్యా చట్టం తెచ్చేందుకు తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో విద్యా బోధన జరపాలని నిర్ణయించింది. ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు అధ్యయనం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ రెండు అంశాలపై విధివిధానాల రూపకల్పనకు కేబినెట్‌ సబ్‌ కమిటి ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటి ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Cabinet Key Decision : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. ఫీజుల నియంత్రణ, విద్యా బోధనకు నూతన చట్టం

ఈ కమిటీలో సభ్యులుగా కేటీఆర్‌, హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస యాదవ్‌, పువ్వాడ అజయ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌ రెడ్డి ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలోను బలోపేతం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, వసతుల కల్పనకు 7,289 కోట్లతో మన ఊరు మన బడి ప్రణాళికకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.